amp pages | Sakshi

ఏపీ: కోవిడ్‌–19 మహమ్మారికి ఏడాది

Published on Wed, 03/10/2021 - 04:09

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోకి కోవిడ్‌–19 మహమ్మారి ప్రవేశించి సరిగ్గా ఏడాది పూర్తయింది. యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌ ఐదారు నెలల పాటు రాష్ట్ర ప్రజలను నిలువెల్లా వణికించింది. చైనాలో పుట్టి.. పాశ్చాత్య దేశాలకు పాకి.. అక్కడి నుంచి భారత్‌లోకి, ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌కు చేరిన ఈ మహమ్మారి భారీ నష్టాన్నే మిగిల్చింది. రాష్ట్రంలోనే తొలి కేసు 2020 మార్చి 10న నెల్లూరు వాసికి సోకినట్టు నిర్ధారణ అయింది. అలా మొదలై గత ఏడాది నవంబర్‌ వరకూ ఉధృతంగా కొనసాగింది. ఈ ఏడాది మార్చి 8వ తేదీ నాటికి రాష్ట్రంలో 7,176 మంది ప్రాణాలను బలిగొంది.

కరోనా కట్టడిలో ఏపీ ఫస్ట్‌
► కోవిడ్‌–19 నియంత్రణలో దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌ (టీటీటీ) అనే లక్ష్యంతో కరోనాను నియంత్రించగలిగారు. 

► దేశంలో మిలియన్‌ జనాభాకు ఎక్కువ టెస్టులు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రికార్డు నెలకొల్పింది. ఒక్క వైరాలజీ ల్యాబ్‌ కూడా లేని స్థాయి నుంచి 14 ల్యాబొరేటరీలు సమకూర్చుకుని దీటుగా నిలబడింది. 

► కోవిడ్‌ బాధితుల కోసం క్వారంటైన్‌ కేంద్రాలు నెలకొల్పడమే కాకుండా వారికి ప్రోటీన్‌ కలిగిన ఆహారాన్ని సైతం ఉచితంగా సమకూర్చింది. 

► కోవిడ్‌ చికిత్సనూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి రికార్డు సృష్టించింది. వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ పైప్‌లైన్‌లు, పడకల ఏర్పాటు వంటి విషయాల్లో ఏ రాష్ట్రమూ చేయనంత కృషి చేయగలిగింది. 

► కోవిడ్‌ నియంత్రణకు, కిట్‌లకు, ల్యాబొరేటరీలు వంటి వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 1,458.27 కోట్లు ఖర్చు చేసింది. నేటికీ ఇందుకోసం ఎంత అవసరమైనా నిధులు వెచ్చిస్తోంది. 

► మందులు, ఆక్సిజన్, పీపీఈ కిట్లు, మాస్కులు వంటి వాటికి రూ.783 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది.

► టెస్టింగ్‌లు, ట్రేసింగ్, రవాణా, క్వారంటైన్‌ కేంద్రాలు, కోవిడ్‌ కేర్‌ సెంటర్ల నిర్వహణ, అవగాహన కార్యక్రమాలకు కలెక్టర్ల ఆధ్వర్యంలో రూ.559.07 కోట్లు ఖర్చు చేశారు. 

కీలక ఘట్టాలు
► ఫ్రాన్స్‌ నుంచి నెల్లూరుకు వచ్చిన వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. 2020 మార్చి10న ఇది తొలి కోవిడ్‌ కేసుగా నమోదైంది.

► ఒక నెలలో అత్యధిక టెస్టులు చేసింది 2020 అక్టోబర్‌లో. ఆ నెలలో 22,39,550 టెస్టులు చేశారు.

► 2020 ఆగస్ట్‌లో అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ నెలలో 2,94,930 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

► 2020 ఆగస్ట్‌లో అత్యధికంగా 2,646 మంది కోవిడ్‌తో మృతి చెందారు. ఇదే నెలలో అత్యధికంగా 16.66 శాతం పాజిటివిటీ నమోదైంది.

► 2020 డిసెంబర్‌ నుంచి కోవిడ్‌ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. నవంబర్‌లో 42,783 కేసులు నమోదు కాగా, డిసెంబర్‌లో 13,863 మాత్రమే నమోదయ్యాయి

Videos

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

దేవర కోసం దసరా రేస్ నుంచి వెనక్కి తగ్గిన సినిమాలు

మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్ సీపీ

బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా

ప్రచారంలో దూసుకుపోతున్న అరకు ఎంపీ అభ్యర్థి తనూజ రాణి

Photos

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)