కీచక తండ్రి: కన్న కూతురిపై అఘాయిత్యం.. ఆపై..

Published on Thu, 09/09/2021 - 03:56

లబ్బీపేట (విజయవాడ తూర్పు):  కులాంతర వివాహం చేసుకున్నాడు. రెండు విద్యాసంస్థల్లో ఫిజికల్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. ఎంతో ఉదాత్తంగా ఉండాల్సిన ఆ వ్యక్తి తన ఐదేళ్ల కుమార్తెపై అత్యాచారానికి ఒడిగట్టి కటకటాల పాలయ్యాడు. ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. విజయవాడ నగరంలోని స్కూల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌ ఇనిస్టిట్యూట్‌తో పాటు మరో ఇంజినీరింగ్‌ కళాశాలలో ఫిజికల్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్న నిందితుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కాగా, నున్న మ్యాంగో మార్కెట్‌ సమీపంలో అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. కాగా, ఈ ఏడాది జూన్‌ 26న అతడు తన ఐదేళ్ల కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఈ విషయం బాలిక తల్లికి తెలియడంతో ఇంటి నుంచి పరారయ్యాడు. ఆ విషయాన్ని తల్లి బయటకు చెప్పుకోలేకపోయింది. కాగా, ఈ నెల 4న ఇంటికి వచ్చి తండ్రి ఆ పాపను అపహరించే ప్రయత్నం చేయగా.. ఆమె నాయనమ్మ అడ్డుకుని పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసింది. ఈ ఘటనపై దిశ పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ బాలికకు పాత ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలావుండగా.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సమాఖ్య నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం పాత ప్రభుత్వాస్పత్రికి చేరుకుని ఘటనపై నిరసన తెలియజేశారు.

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)