amp pages | Sakshi

కేటీఆర్‌ వ్యాఖ్యలపై సజ్జల స్ట్రాంగ్‌ కౌంటర్‌

Published on Fri, 04/29/2022 - 18:06

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. కేటీఆర్ అయినా మరెవరైనా మాట్లాడే ముందు వాళ్ల రాష్ట్రం గురించి మాట్లాడాలన్నారు. ఆ తర్వాతే ఇతరుల గురించి మాట్లాడాలని సూచించారు. ఈ మేరకు సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. 'రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపకాలు ఇంకా పూర్తిగా జరగలేదు. సుమారు రూ.50-60 వేల కోట్ల ఆస్తులు విభజన జరగాల్సి ఉంది. ఏపీకి కేపిటల్ లేకుండానే విభజన చేశారు. విభజన తర్వాత 5 ఏళ్లపాటు అభివృద్ది జరగలేదు.

చదవండి: (కేటీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి)

ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ది చెందింది. హైదరాబాద్‌లో పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే వైఎస్ హయాంలో చేపట్టారు. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో వాళ్లకూ, మనకూ అందరికీ తెలుసు. అధిక వర్షాల వల్లే రాష్ట్రంలో రోడ్లు దెబ్బతిన్నాయి. కేటీఆర్ వ్యాఖ్యలను రాజకీయం చేయదలచుకోలేదు. తెలంగాణలోనూ రోడ్లు బాగాలేవు. మొన్నటి వరకు తెలంగాణలోనూ విద్యుత్ కోతలున్నాయి. రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. సీఎం జగన్ పాలనలో తన మార్కును చూపిస్తున్నారు' అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

చదవండి: (Ramya Murder Case: ఉరిశిక్షపై శశికృష్ణ తల్లి స్పందన ఇదే..) 

ఈ తీర్పు చెంపపెట్టు లాంటిది
గుంటూరులో గత ఏడాది ఆగస్టు 15న జరిగిన బీటెక్‌ విద్యార్థిని నల్లపు రమ్య (20) హత్య కేసులో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధించింది. దిశ చట్టం తెచ్చిన స్ఫూర్తితోనే యువతిని చంపిన నిందితుడికి ఉరిశిక్ష పడిందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దిశ చట్టంపై ప్రతిపక్షాలు చేస్తున్నవన్నీ కూడా రాజకీయ విమర్శలేనన్నారు. దిశ చట్టంపై విమర్శలు చేస్తోన్న వారికి ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

చదవండి: (హైదరాబాద్‌లోనే కరెంట్‌ లేదు: కేటీఆర్‌ వ్యాఖ్యలకు మంత్రి బొత్స కౌంటర్‌)

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)