amp pages | Sakshi

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలు చేయండి

Published on Sun, 02/27/2022 - 05:55

సాక్షి, అమరావతి: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో యువత మరిన్ని పరిశోధనలు చేసి దేశాన్ని అగ్రగామిగా నిలపాలని డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో) ఛైర్మన్‌ డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డి చెప్పారు. ‘ఆజాదీ అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా ఇస్రో, డీఆర్‌డీవో, ఎన్‌ఐటీలు విజయవాడలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ (స్పా)లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను శనివారం ఆయన సందర్శించారు. అనంతరం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశ ప్రగతిని, భవిష్యత్తులో సాధించాల్సిన అభివృద్ధిని అక్కడికి వచ్చిన విద్యార్థులకు వివరించారు. స్వాతంత్య్రం సాధించిన 75 ఏళ్లలోనే భారతదేశం అన్ని రంగాల్లోనూ గణనీయమైన ప్రగతి సాధించిందని చెప్పారు.

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన ఐదారు దేశాల సరసన నిలిచిందని తెలిపారు. స్వాతంత్య్రం సాధించి వందేళ్లు పూర్తయ్యే నాటికి.. అంటే 2047కు అన్ని రంగాల్లోనూ దేశాన్ని అగ్రగామిగా నిలపాలని ప్రధాని దిశానిర్దేశం చేశారని తెలిపారు. దేశంలో అత్యంత ప్రతిభావంతులైన యువత ఉన్నారని, వీరిలో అధికశాతం పారిశ్రామికవేత్తలుగా మారేందుకు ఉత్సుకత చూపుతున్నారని చెప్పారు. ఇటీవల 60 వేల స్టార్టప్‌లు ప్రారంభం కావడమే ఇందుకు నిదర్శనమన్నారు.  

కరోనా మహమ్మారి ప్రబలిన మూడున్నర నెలల్లోనే.. వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేసి ప్రపంచానికి అందించిన ఘనత మనకు దక్కిందన్నారు. కరోనా మహమ్మారి తొలి దశలో విరుచుకుపడినప్పుడు డీఆర్‌డీవో అందించిన సాంకేతిక పరిజ్ఞానంతో దేశీయంగా రోజుకు నాలుగు లక్షల పీపీఈ కిట్‌లు, 60 వేలకుపైగా వెంటిలేటర్లను తయారుచేసి, దేశంతో పాటు ప్రపంచానికీ అందించామన్నారు.  రక్షణ రంగంలో అత్యున్నత ప్రమాణాలతో వివిధ రకాల క్షిపణులను తయారుచేశామని వివరించారు.

వీటిని దేశ రక్షణ అవసరాలకు వినియోగించడంతోపాటు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నామన్నారు. ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలతో అర్జున్‌ ట్యాంక్‌ను తయారుచేశామని చెప్పారు. రోదసీ రంగంలో అమెరికా, చైనా, రష్యాలతో ఇస్రో పోటీ పడుతోందన్నారు. చంద్రుడు, అంగారక గ్రహాలపై పరిశోధనలకు చంద్రయాన్, మంగళయాన్‌లను చేపట్టామని వివరించారు. ప్లాస్టిక్‌ను నిర్మూలించి, పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పారు. ప్లాస్టిక్‌ బ్యాగ్‌ల స్థానంలో పర్యావరణ హితమైన బయోడిగ్రేడబుల్‌ బ్యాగ్‌లను డీఆర్‌డీవో రూపొందించిందన్నారు. ఈ పరిజ్ఞానాన్ని ఉచితంగా అందిస్తామని, ఆ బ్యాగ్‌లను విరివిగా తయారుచేయాలని యువతకు సూచించారు.  

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)