ఏడు కోట్ల మంది వీక్షకులు.. మంగారాణి యూట్యూబ్‌ చానల్‌.. లెసెన్స్‌.. అదుర్స్‌ 

Published on Wed, 10/12/2022 - 15:41

కంబాలచెరువు(రాజమహేంద్రవరం)తూర్పుగోదావరి: స్థానిక శ్రీనాగరాజా నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మోటూరి మంగారాణి అరుదైన ఘనత సాధించారు. విద్యార్థులకు సులువైన బోధన దిశగా ‘మంగారాణి లెస్సన్స్‌’ పేరుతో ఆమె నిర్వహిస్తున్న యూట్యూబ్‌ చానల్‌కు సుమారు 100కు పైగా దేశాల్లో ఏడు కోట్ల మంది వీక్షకులతో పాటు రెండు లక్షల మంది సభ్యులు చేరారు. ఒక ఉపాధ్యాయ యూట్యూబ్‌ చానల్‌కు రెండు లక్షల మంది సభ్యులు ఉండడం చాలా అరుదు.
చదవండి: అలా గిన్నిస్‌ రికార్డు ‘అల్లు’కుపోయారు 

మంగారాణి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో గేయాలు, యానిమేషన్‌ చిత్రాలతో వీడియో పాఠాలను రూపొందించి తన యూట్యూబ్‌ చానల్‌ ద్వారా అనేక మంది ఉపాధ్యాయులకు అందజేస్తున్నారు. ఈ పాఠాలను రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ శిక్షణ నిమిత్తం ప్రారంభించిన దీక్ష ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ ద్వారా  ప్రస్తుత నూతన పాఠ్యపుస్తకాల్లోని క్యూఆర్‌ కోడ్‌లతో కూడా మంగారాణి అనుసంధానించారు. ఈ సందర్భంగా మంగారాణిని అర్బన్‌ రేంజ్‌ డీఐ బి.దిలీప్‌ కుమార్, పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ