టీటీడీ ఛైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి

Published on Sun, 08/08/2021 - 13:01

సాక్షి, తిరుమల: టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన టీటీడీ ఛైర్మన్‌గా మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో టీటీడీ బోర్డు సభ్యుల నియామకం జరగనుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీటీడీ ఛైర్మన్‌గా రెండోసారి అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కలియుగ దైవం శ్రీనివాసుడి ఆశీస్సులతో.. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు.

తిరుమల పవిత్రత కాపాడేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, తిరుమలపై కాలుష్య నివారణే లక్ష్యంగా.. ఎలక్ట్రిక్‌ వాహనాలను త్వరలో అందుబాటులోకి తీసుకోస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆర్గానిక్‌ మూల పదార్థాలతో నైవేద్యం తయారీ, కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు.  మరిన్ని దేశీయ భాషల్లో ఎస్‌వీబీసీ ఛానల్‌ను తీసుకురానున్నట్లు తెలిపారు. డ్రోన్ల సాంకేతికతతో ఏడుకొండల భద్రత కల్పించనున్నట్లు తెలిపారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ