Today StockMarketOpening: అదానీ, ఐటీ షేర్లు ఢమాల్‌; సెన్సెక్స్‌ పతనం

Published on Mon, 02/13/2023 - 10:37

సాక్షి,ముంబై: దేశీయస్టాక్‌  మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్‌ ఏకంగా 372 పాయింట్లు కుప్ప కూలి 60307 వద్ద, నిఫ్టీ  107 పాయింట్ల పతనంతో  17749 వద్ద కొనసాగుతున్నాయి. మెటల్‌ తప్ప అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ఉన్నాయి.  ముఖ్యంగా అదానీ, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, ఎంఫసిస్‌ తదితర ఐటీ స్టాక్స్‌ పతనం మార్కెట్‌ను ప్రభావితం చేస్తోంది. 

అదానీ సంక్షోభం
మార్కెట్లో అదానీ సంక్షోభం​ కొనసాగుతోంది. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ (శుక్రవారం) నాలుగు అదానీ స్టాక్‌ల  రేటింగ్‌ 'స్టేబుల్' నుండి 'నెగటివ్'కి డౌన్‌గ్రేడ్ చేయడంతో అమ్మకాలు కొనసాగుతున్నాయి. అటు  సంస్థ కూడా తన ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని సగానికి తగ్గించింది. తాజాగా మూలధన వ్యయాన్ని తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది అదానీ. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దారుణంగా దెబ్బతింది.   ఇప్పటికే అదానీ లిస్టెడ్ ఎంటిటీలు మార్కెట్ విలువ 120 బిలియన్‌ డాలర్లకు పైగా కుప్పకూలింది. అటు జనవరి రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాల ‍కోసం పెట్టుబడిదారులు వెయిట్‌ చేస్తున్నారు.

టైటన్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, సన్‌ఫార్మ, బజాజ్‌ ఆటో లాభపడుతుండగా, అదానీ ఎంటర్‌పప్రైజెస్‌, ఎస్‌బీఐ, ఎం అండ్‌ఎం,  ఇన్ఫోసిష్‌, అదానీ పోర్ట్స్‌ టాప్‌ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి. మరోవైపు  డాలరుమారకంలో రూపాయి 28 పైసలు  నష్టంతో 82.73 వద్ద కొనసాగుతోంది. 


 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ