మార్కెట్‌లో అస్థిరత.. భారీగా నష్టపోయిన సూచీలు

Published on Fri, 01/14/2022 - 09:50

ముంబై: దేశీ స్టాక్‌ మార్కెట్‌లో అస్థిరత కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు ‍స్వల్ప కాలిక లాభాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో మెటల్‌, ఐటీ కంపెనీల షేర్ల దన్నుతో నిన్న లాభాలతో ముగిసిన మార్కెట్‌ ఈ రోజు వెంటనే భారీగా పాయింట్లను కోల్పోతూ నష్టాలను చవి చూసింది. ఆ వెంటనే కనిష్ట ధరల దగ్గర మరోసారి కొనుగోళ్లు ఊపందుకోవడంతో మార్కెట్‌ నెమ్మదిగా కోలుకుంటోంది.

ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సన్సెక్స్‌ 61,040 పాయింట్లతో ప్రారంభంమైంది. ఆ వెంటనే వరుసగా పాయింట్లు కోల్పోతూ 60,757 పాయింట్లకు పడిపోయి 400లకు పైగా పాయింట్లు కోల్పోయింది. అక్కడ కొనుగోలు దారుల మద్దతు లభించడంతో క్రమంగా పాయింట్లు పుంజుకుంటూ ఉదయం 9:45 గంటల సమయానికి 166 పాయింట్ల నష్టంతో 61,069 పాయింట్ల దగ్గర ఉంది. ఇక నిఫ్టీలో సైతం ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. 41 పాయింట్ల నష్టంతో 18,216 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ