బల్లిలా పాకుతూ.. కప్పలా గెంతుతూ..

Published on Thu, 12/16/2021 - 21:26

‘చెట్టులెక్కగలవా.. ఓ నరహరి పుట్టలెక్కగలవా?’ ఇది పాత సినిమాలోని ఓ పాట. ఇదే ప్రశ్న ఫొటోల్లో కనిపిస్తున్న రోబోలను అడిగారనుకోండి! ‘‘ఓ.. భేషుగ్గా’’ చెట్లు, పుట్టలేం ఖర్మ.. గోడలు, మెట్లు, ఎగుడుదిగుడు దారులన్నీ ఎక్కేస్తాం అంటాయి! ఆ రకంగా తయారు చేశారు వాటిని మరి. గోడపై బల్లిలా అతుక్కుని కనిపిస్తోందే.. ఈ రోబో పేరు హెచ్‌బీ1. హాస్‌బోట్స్‌ అనే బ్రిటిష్‌ కంపెనీ తయారు చేసింది. ఎత్తైన భవనాల అద్దాలు తుడవడం మొదలు అనేకరకాల పనులు చేయగలదు. కంటితో చూడటం.. అతినీలలోహిత కిరణాల కాంతిలో పరిశీలనలు జరపడం దీని ప్రత్యేకతల్లో కొన్ని మాత్రమే. ఎలా పనిచేస్తుందో చూడాలనుకుంటున్నారా..  https://www.youtube.com/watch?v=XvYTdKBnWdI క్లిక్‌ చేయండి!! 

రెండు చక్రాలున్న ఈ రోబో పేరు అసెంటో–2 ప్రో. సొంతంగా బ్యాలెన్స్‌ చేసుకోవడం, మెట్లు ఎక్కగలగడం, ఎత్తుపల్లాలతో సంబంధం లేకుండా అన్ని రకాల ఉపరితలాలపై వేగంగా ప్రయాణించగలగడం దీని ప్రత్యేకత. స్విట్జర్లాండ్‌లో ఇంజినీరింగ్‌ విద్యార్థి బృందం దీన్ని తయారు చేసింది. అడ్డుగా ఏదైనావస్తే దాని ఎత్తును బట్టి కుప్పించి గెంతగలదు కూడా. బ్యాటరీలో చార్జ్‌ అయిపోతే దగ్గరల్లో ఉన్న చార్జర్‌ను వెతుక్కుని తనంతటతానే చార్జింగ్‌ కూడా చేసుకోగలదు. ఒకసారి చార్జ్‌ చేసుకుంటే గంటకు 12 కిలోమీటర్ల వేగంతో 90 నిమిషాలు పరుగులు పెట్టగలదు.https://www.youtube.com/watch= Uxt2wTI0m5o  అసెంటో–2ప్రో ఎలా పనిచేస్తుందో చూడొచ్చు.  

చదవండి: ఇటలీ కంపెనీ సంచలనం.. బుల్లెట్‌ తగిలినా ఫోన్‌కి నో డ్యామేజ్‌
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ