amp pages | Sakshi

ఈలాన్‌ మస్క్‌ వెనకడుగు వేస్తే ఊరుకునేది లేదు - ట్విటర్‌ బోర్డు

Published on Wed, 05/18/2022 - 11:30

పరస్పర నమ్మకంతో కాకుండా పరస్పర అనుమానాలతో మొదలైన ట్విటర్‌ డీల్‌ అనేక మలుపులు తీసుకుంటోంది. ట్విటర్‌లో స్పామ్‌/ఫేక్‌ అకౌంట్లు అధికంగా ఉన్నాయని, వాటిపై స్పష్టత వచ్చే వరకు డీల్‌లో అడుగు ముందుకు పడదంటూ ఈలాన్‌మస్క్‌ ప్రకటించగా.. చట​‍్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగా ట్విటర్‌ బోర​‍్డు వ్యవహరిస్తోంది.

పేచీ అక్కడే
ట్విటర్‌లో ఒక్కో షేరుకు 54.20 డాలర్లుగా వెల కట్టి ఏకమొత్తంగా 44 బిలియన్‌ డాలర్లు చెల్లించి ట్విటర్‌ను టేకోవర్‌ చేస్తానంటూ ఈలాన్‌మస్క్‌ ప్రకటించారు. ట్విటర్‌ బోర్డు నుంచి వ్యతిరేకత వచ్చినా షేర్‌ హోల్డర్లు ఈ డీల్‌కు సానుకూలంగా ఉండటంతో.. ఇరు వర్గాల మధ్యన ఒప్పందం జరిగింది. మరికొద్ది రోజుల్లో ట్విటర్‌ ఈలాన్‌ మస్క్‌ చేతుల్లోకి వెళ్తుందనగా ఫేక్‌ అకౌంట్ల విషయంలో ఇరు వర్గాల మధ్య పేచీ మొదలైంది.  

షరతులు వర్తిస్తాయి
ట్విటర్‌ టేకోవర్‌కి సంబంధించిన ఒప్పందంలో... ఎవరైనా ఈ డీల్‌ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గితే వన్‌ బిలియన్‌ డాలర్లు పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు డీల్‌ విషయంలో ఈలాన్‌ మస్క్‌ మాట మారుస్తున్నందున తాము ఒప్పందంలోని కండీషన్స్‌ను అప్లై చేయాలని ట్విటర్‌ బోర్డు కోరనున్నట్టు సమాచారం. అంటే ఈలాన్‌మస్క్‌ను వన్‌ బిలియన్‌ డాలర్లు నష్ట పరిహారంగా కట్టమని అడుగుతామంటోంది.

అదొక్కటే మార్గం
ఒప్పందం డీల్‌ ప్రకారం ఈలాన్‌ మస్క్‌ ఈ భారీ పరిహారం నుంచి తప్పించుకోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. వెరిఫైడ్‌ సోర్స్‌ ద్వారా తాను ఆరోపిస్తున్నట్టుగా ట్విటర్‌లో ఫేక్‌ ఖాతాలు 20 శాతంగా ఉన్నాయని నిరూపించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మస్క్‌ ఎటువంటి పరిహారం కట్టాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో ఈ ట్విటర్‌ డీల్‌ మరెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.  

చదవండి: ట్విటర్‌కి బ్రేకప్‌ చెప్పిన ఈలాన్‌ మస్క్‌?
 

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)