amp pages | Sakshi

ధరలు పైపైకి.. ఆ ఇళ్లకు ఫుల్‌ డిమాండ్‌, అవే కావాలంటున్న ప్రజలు!

Published on Fri, 12/16/2022 - 09:07

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు 6–10 శాతం పెరిగే అవకాశం ఉందని క్రిసిల్‌ వెల్లడించింది. 2023–24లో 3–5 శాతం ధరలు దూసుకెళ్లవచ్చని అంచనా వేస్తోంది. ముడి సరుకు వ్యయాలు, కూలీ, స్థలాల ధరలు అధికం కావడమే ఇందుకు కారణమని వివరించింది.

హైదరాబాద్, ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్, నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్, బెంగళూరు, పుణే, కోల్‌కత నగరాల ఆధారంగా క్రిసిల్‌ రూపొందించిన నివేదిక ప్రకారం.. రెసిడెన్షియల్‌ విభాగంలో పెద్ద రియల్టర్లు 2022–23లో 25 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 10–15 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేయబోతున్నారు.

అమ్మకం కాని ఇళ్ల స్థాయి 4 నుండి 2.5 సంవత్సరాలకు వచ్చి చేరింది. ఇది పెద్ద రియల్టర్ల క్రెడిట్‌ ప్రొఫైల్‌ను బలపరుస్తుంది.  

ఖరీదైన ఇళ్లకు డిమాండ్‌..
కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల్లో మహమ్మారి ముందు పెద్ద రియల్టర్ల వాటా 30 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 40–45 శాతం ఉండే అవకాశం ఉంది. పరిశ్రమలో పెద్ద రియల్టర్ల వాటా 2022–23లో 24 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 25 శాతానికి చేరనుంది.

మహమ్మారి ముందు కాలంలో ఇది 14 శాతం నమోదైంది. 2020కి ముందు రూ.1.5 కోట్లు ఆపైన ఖరీదు చేసే ఇళ్ల వాటా 25–30 శాతం. ఇప్పుడు ఇది ఏకంగా 40–45 శాతానికి ఎగసింది.

రూ.40 లక్షల లోపు ఉండే అందుబాటు ధరల గృహాల వాటా 30 నుంచి 10 శాతానికి పరిమితం అయింది. గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో పెద్ద రియల్టర్లు వాటాల విక్రయం,ఆస్తుల అమ్మకం ద్వారా రూ.18,000 కోట్లు అందుకున్నారు. ఈ సంస్థల  ఆస్తుల్లో అప్పుల నిష్పత్తి 2023 మార్చి నాటికి 23 శాతం, 2024 మార్చికల్లా 21 శాతంగా ఉండనుంది.
 

చదవండి: భారత్‌లో అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్‌ వాసి.. వామ్మో అన్ని కోట్లా!


 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)