amp pages | Sakshi

ట్యాక్స్ రిటర్నులు రద్దు అయితే ఏం చేయాలి?

Published on Mon, 05/17/2021 - 14:13

గత కొద్ది రోజులుగా మీలో కొంత మంది గమనించే ఉంటారు. 31-3-2020తో పూర్తయిన ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారిలో కొంత మందికి నోటీసులు వచ్చాయి. సెక్షన్‌ 139(9) ప్రకారం డిపార్టుమెంటు వారు నోటీసులు ఇవ్వొచ్చు. ఈ నోటీసుకి బదులుగా రిటర్నుని సరిచేస్తూ 15 రోజుల్లో తెలియజేయాలి. 

ఏ సందర్భంలో తప్పులు జరిగే అవకాశం ఉందంటే.. 

  • సరైన ఫారంలో రిటర్న్‌ ఫైల్‌ చేసి ఉండకపోతే.. ఉదాహరణకు ఫారం 2కి బదులుగా ఫారం 3 ఫైల్‌ చేయడం వంటివి. 
  • రిటర్నుల్లో అంశాలకు సంబంధించి వివరాలు పొందుపర్చకపోవడం. నింపకపోవడం. తప్పుగా రాయడం. 
  • ఇలాంటి ఉదాహరణలు చాలా ఉంటాయి. చిన్న చిన్న తప్పులు దొర్లుతుంటాయి. ప్రతీ కాలమ్‌కి బదులివ్వాలి. కొన్ని మీకు వర్తించవు. కొన్ని మీకు ఉండకపోవచ్చు. వర్తించకపోతే ‘నాట్‌ అప్లికేబుల్‌’ అని రాయాలి. ఉండకపోతే ‘నిల్‌’ అని రాయాలి. ఆన్‌లైన్‌ ఫైలింగ్‌లో చిన్న తప్పు జరిగినా, రిటర్ను డిఫెక్టివ్‌ అయిపోతుంది. 
  • ఆదాయం వివరాలను తప్పుగా డిక్లేర్‌ చేసినా, టీడీఎస్‌ మొత్తానికి.. ఆదాయానికి పొంతన లేకపోయినా.. అంటే ఉదాహరణకు వడ్డీకి సంబంధించిన టీడీఎస్‌ చూపించి ఆ ఆదాయాన్ని చూపించకపోవడం లాంటి తప్పిదాలు. 
  • అకౌంట్‌ బుక్స్‌ కంపల్సరీ అయిన చోట ‘అవసరం లేదు’ అని రాయడం. ఆడిట్‌ అవసరం అయిన చోట ఆ వివరాలు రాయకపోవడం, వివరాలను తప్పుగా రాయడం .. ట్యాక్స్‌ ఆడిట్‌ వివరాలు రాయకపోవడం లేదా తప్పుగా రాయడం మొదలైనవి 
  • ఊహాజనిత పన్ను చెల్లించినప్పుడు వివరాలు ఇవ్వకపోవడం, తప్పుగా రాయడం 
  • పన్నులు చెల్లించిన వివరాలు పొందుపర్చకపోవడం, పన్నుల వివరాలు సరిపోలకపోవడం 
  • సమాచారం తప్పుగా రాయడం.. వ్యత్యాసాలు కనిపించడం, షెడ్యూల్‌లో వివరాలు తప్పుగా రాయడం వంటి తప్పిదాలు 

 
ఇలాంటి తప్పిదాలు జరిగినప్పుడు నోటీసులు రావచ్చు. అయితే, ఆ నోటీసులు రాగానే.. 

  • భయపడనవసరం లేదు. 
  • ‘డిఫెక్ట్‌’ ఏమిటో తెలుసుకోండి. వెబ్‌సైట్‌లో లాగిన్‌ అవ్వండి. 
  • నోటీసు కనిపిస్తుంది. డౌన్‌లోడ్‌ చేయండి 
  • ‘డిఫెక్ట్‌’ని అర్థం చేసుకోండి. 
  • వారు పేర్కొన్న ‘డిఫెక్ట్‌’ని అంగీకరించిన పక్షంలో, ఒప్పుకున్నామని తెలియజేస్తూ దాన్ని సరిచేయండి. 
  • ఒకవేళ వారితో ఏకీభవించకపోతే ‘నో’ అని జవాబు ఇవ్వండి. ఇందుకు తగిన కారణాలు చెప్పాలి. 
  • జవాబు 15 రోజుల్లోగా ఇవ్వాలి 
  • అలా ఇవ్వకపోతే రిటర్ను రద్దు అయిపోతుంది. మీరు రిటర్నులు దాఖలు చేసినట్లుగా పరిగణించరు. 
  • డిఫెక్ట్‌ని సరిచేసినప్పుడు సమగ్ర సమాచారం ఇవ్వాలి. రిటర్నుని మళ్లీ నింపాల్సి రావచ్చు.  
  • రిఫరెన్సులు ఇవ్వాలి. స్క్రీన్‌ మీద అన్ని వివరాలు వస్తాయి. ఓపిగ్గా.. జాగ్రత్తగా సరిచేయండి.

ట్యాక్సేషన్‌ నిపుణులు:
కె.సీహెచ్‌. ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూరి
కె.వి.ఎన్‌ లావణ్య

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)