ఉప్పు అమ్మకాల నుంచి తప్పుకున్న హిందుస్థాన్ యూనీలివర్

Published on Sat, 02/18/2023 - 07:27

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్‌ ప్రధాన వ్యాపారేతర ఆటా (పిండి), ఉప్పు విభాగాల నుంచి తప్పుకుంటోంది. తమ అన్నపూర్ణ, కెప్టెన్‌ కుక్‌ బ్రాండ్‌లను సింగపూర్‌కు చెందిన ఉమా గ్లోబల్‌ ఫుడ్స్‌కి విక్రయిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

ఈ డీల్‌ విలువ రూ. 60.4 కోట్లు. ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వివరించింది. ఈ రెండు బ్రాండ్లను దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రెండింటి టర్నోవరు రూ. 127 కోట్లుగా నమోదైంది. ఇది కంపెనీ మొత్తం టర్నోవరులో ఒక్క శాతంలోపే ఉండటం గమనార్హం. సింగపూర్‌కి చెందిన రియాక్టివేట్‌ బ్రాండ్స్‌ ఇంటర్నేషనల్‌కు ఉమా గ్లోబల్‌ ఫుడ్స్‌ అనుబంధ సంస్థ.   

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ