amp pages | Sakshi

ఇన్ఫినిక్స్‌ నుంచి తొలి 55 ఇంచెస్‌ టీవీ.. తక్కువ ధరకే వావ్‌ అనిపించే ఫీచర్లు!

Published on Mon, 09/19/2022 - 11:36

కొంత కాలంగా బడ్జెట్ టీవీల మార్కెట్లో దూసుకుపోయిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ తాజాగా ప్రీమియం ఆండ్రాయిడ్ టీవీ విభాగంలోకి ప్రవేశించింది. టెలివిజన్‌ మార్కెట్లో తమ మార్కెట్‌ని అన్ని విభాగంలో విస్తరిస్తూ, ఇన్ఫినిక్స్ 50 ఇంచెస్‌,  55 ఇంచెస్‌ జీరో సిరీస్‌ను లాంచ్‌ చేసింది. ప్రత్యేకంగా ఇన్ఫినిక్స్ జీరో (Infinix Zero 55 Inch QLED 4K) స్మార్ట్ టీవీని అదిరిపోయే ఫీచర్లతో కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది. ఇందులో డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్, హెచ్‌డీఆర్ 10+ సపోర్ట్‌తో వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా  ఈ స్మార్ట్ టీవీలో అద్భుతమైన క్వాంటమ్ డాట్ టెక్నాలజీని అమర్చారు.

జీరో సిరీస్‌లోని  ZERO 55-inch QLED 4K TV రూ. 34,990 గా ఉంది. ప్రస్తుతం ఉన్న X3 సిరీస్ క్రింద ప్రారంభించిన ఇతర ఇన్ఫినిక్స్‌ 50 ఇంచెస్‌ 4K TV ధర కేవలం రూ. 24,990.  ఈ రెండు ఆండ్రాయిడ్ టీవీలు సెప్టెంబర్ 24 నుంచి సేల్స్‌ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

మైండ్‌బ్లోయింగ్‌ ఫీచర్లు ఇవే..
మీకు ఇష్టమైన టీవీ షోలు, స్పోర్ట్స్ మ్యాచ్‌లు, సినిమాల ఫ్రేమ్ రేట్‌ను పెంచేందుకు డాల్బీ విజన్, హెచ్‌డీఆర్‌( HDR 10+) సపోర్ట్ , బెజెల్ లెస్ డిజైన్‌ దీని ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పిక్చర్ క్వాలిటీ మెరుగ్గా ఉండేలా క్వాంటమ్ డాట్ డిస్‌ప్లేను ఇస్తున్నట్టు ఇన్ఫినిక్స్‌ పేర్కొంది. మీడియా టెక్‌ క్వాడ్‌కోర్ మీడియాటెక్ సీఏ55 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ టీవీ రన్ అవుతుంది. 2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ ఉంది. పీక్ ‌బ్రైట్‌నెస్ 400 నిట్స్ వరకు ఉంటుంది.

 ఆండ్రాయిడ్‌ 11 టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తోంది.  వైర్‌లెస్‌ కనెక్టివిటీ కోసం డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ ఫీచర్లు ఉన్నాయి. ఈ QLED స్మార్ట్ టీవీకి మూడు HDMI పోర్ట్‌లు, రెండు USB పోర్ట్‌లు, హెడ్‌ఫోన్ పోర్ట్, డ్యూయల్ బ్యాండ్ వైఫై పోర్ట్‌లు ఉన్నాయి. ఇందులో డాల్బీ డిజిటల్ ఆడియోతో కూడిన రెండు పవర్‌పుల్‌ ఇన్నర్‌ బిల్ట్‌ 36వాట్స్‌ బాక్స్ స్పీకర్‌లు, 8K నుండి 20K Hz వరకు సౌండ్‌ క్వాలిటీని పెంచే 2 ట్వీటర్‌లు ఉన్నాయి. 

ఈ ప్రీమియం టీవీ సిరీస్ గురించి మాట్లాడుతూ, ఇన్ఫినిక్స్ ఇండియా సీఈఓ అనీష్ కపూర్, మాట్లాడుతూ.. మా ఫ్లాగ్‌షిప్ క్వాంటం డాట్ టెక్నాలజీతో తయారుచేసిన సరికొత్త 55 ఇంచెస్‌ QLED 4K TV భవిష్యత్తులో గేమ్-ఛేంజర్‌ గా మారుతుందన్నారు.

చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్‌ చవకైన ప్లాన్‌.. రూ.275 ప్లాన్‌తో 3300జీబీ.. ఆఫర్‌ లాస్ట్‌ డేట్‌ ఇదే!

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)