amp pages | Sakshi

రికార్డుల ర్యాలీకి చెక్‌-  ఐటీ అప్‌

Published on Tue, 01/05/2021 - 10:12

ముంబై, సాక్షి: చిట్టచివరికి  9 రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీయడంతో మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యాయి.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 141 పాయింట్లు క్షీణించి 48,036కు చేరింది. నిఫ్టీ సైతం 53 పాయింట్లు తక్కువగా 14,080 వద్ద ట్రేడవుతోంది. కోవిడ్‌-19 కట్టడికి ఒకేసారి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో సోమవారం సెన్సెక్స్‌ 48,000 పాయింట్ల మైలురాయిని అధిగమించిన సంగతి తెలిసిందే. ఈ బాటలో 9 రోజులుగా మార్కెట్లు రికార్డుల ర్యాలీ చేస్తుండటంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు అమ్మకాలు చేపడుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 48,130-47,903 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. ఇక నిఫ్టీ సైతం 14,116-14,048 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.

మీడియా, రియల్టీ ఓకే
ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌, పీఎస్‌యూ బ్యాంకింగ్‌‌, ఆటో 1 శాతం స్థాయిలో బలహీనపడగా.. మీడియా, ఐటీ 0.5 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో యాక్సిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, విప్రో మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 2.3-0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. ఇతర బ్లూచిప్స్‌లో టాటా మోటార్స్‌, హిందాల్కో, ఓఎన్‌జీసీ, ఎంఅండ్‌ఎం, ఎన్‌టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐవోసీ, కోల్‌ ఇండియా, ఐసీఐసీఐ, బజాజ్‌ ఆటో, బీసీసీఎల్‌ 3-1.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. 

ఎంజీఎల్‌ జోరు
డెరివేటివ్‌ స్టాక్స్‌లో ఎంజీఎల్‌, ఐజీఎల్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, అపోలో హాస్పిటల్‌, మదర్‌సన్‌, జూబిలెంట్‌ ఫుడ్‌, జీ, నౌకరీ, ఇండస్‌టవర్‌ 4.2- 1.6 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు పిరమల్‌, ఇండిగో, చోళమండలం, కెనరా బ్యాంక్‌, భారత్‌ ఫోర్జ్‌, ఐడియా, ఆర్తి ఇండస్ట్రీస్‌, లాల్‌పాథ్‌ 2.6-1.2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్ క్యాప్స్‌ 0.2 శాతం పుంజుకుంది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,229 నష్టపోగా.. 1149 లాభాలతో ట్రేడవుతున్నాయి. 

పెట్టుబడులవైపు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,843 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 715 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. గత శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 506 కోట్లు, డీఐఐలు రూ. 69 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసిన విషయం విదితమే. 

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)