మెర్సిడెస్‌ నుంచి 10 కొత్త మోడళ్లు.. ధర ఎంతంటే?

Published on Sat, 01/07/2023 - 13:44

న్యూఢిల్లీ: జర్మనీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ భారత్‌లో ఈ ఏడాది 10 నూతన మోడళ్లను ప్రవేశపెట్టనుంది. వీటిలో అత్యధికం రూ.1 కోటికిపైగా ధరల శ్రేణిలో ఉంటాయని కంపెనీ తెలిపింది. 2022లో భారత్‌లో కంపెనీ నూతన రికార్డు సాధించి 15,822 యూనిట్లను విక్రయించింది. 2021లో 11,242 యూనిట్లు రోడ్డెక్కాయి.

గతేడాది అమ్ముడైన కార్లలో రూ.1 కోటిపైన ధర కలిగిన టాప్‌ ఎండ్‌ మోడళ్లు 3,500 యూనిట్లకుపైమాటే. ఈ విభాగం అంత క్రితం ఏడాదితో పోలిస్తే 69 శాతం వృద్ధి చెందడం విశేషం.

ఇప్పటి వరకు కంపెనీ ఖాతాలో 2018లో అ మ్ముడైన 15,583 యూనిట్లే అధికం. టాప్‌ ఎండ్‌ మోడళ్ల వాటా 2018లో 12 % ఉంటే గతేడాది ఇది ఏకంగా 22 శాతానికి చేరిందని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్‌ అయ్యర్‌ తెలిపారు.   

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ