ఈ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌..  రేసు గుర్రాలు

Published on Fri, 08/14/2020 - 15:16

హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి పతన బాట పట్టాయి.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 450 పాయింట్లు, నిఫ్టీ 131 పాయింట్లు చొప్పున పడిపోయాయి. ఈ నేపథ్యంలోనూ కొన్ని మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లు భారీ లాభాలతో దూకుడు చూపున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం పెరిగింది. జాబితాలో శ్రీరామ్‌ సిటీయూనియన్‌ ఫైనాన్స్‌, ఈక్లర్క్స్‌ సర్వీసెస్‌, మహీంద్రా లైఫ్‌స్పేస్‌, టీసీపీఎల్‌ ప్యాకేజింగ్‌, అశోకా బిల్డ్‌కాన్‌, ఎన్‌డీఆర్‌ ఆటో కంపోనెంట్స్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం...

శ్రీరామ్‌ సిటీ యూనియన్‌ ఫైనాన్స్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 11 శాతం దూసుకెళ్లింది. రూ. 793 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 845 వరకూ లాభపడింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 3,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 19,000 షేర్లు చేతులు మారాయి.

ఈక్లర్క్స్‌ సర్వీసెస్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 9 శాతం దూసుకెళ్లింది. రూ. 680 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 735 వరకూ ఎగసింది. ఇది ఏడాది గరిష్టంకావడం విశేషం! బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 12,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 69,000 షేర్లు చేతులు మారాయి.

మహీంద్రా లైఫ్‌స్పేస్‌ డెవలపర్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం జంప్‌చేసి రూ. 236 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 256 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 3,500 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 41,000 షేర్లు చేతులు మారాయి.

అశోకా బిల్డ్‌కాన్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 9 శాతం జంప్‌చేసి రూ. 70 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 1.4 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 5.4 లక్షల షేర్లు చేతులు మారాయి.

ఎన్‌డీఆర్‌ ఆటో కంపోనెంట్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 201 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇది ఏడాది గరిష్టంకావడం గమనార్హం! బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 2,300 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 29,000 షేర్లు చేతులు మారాయి.

టీసీపీఎల్‌ ప్యాకేజింగ్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 15 శాతం దూసుకెళ్లి రూ. 393 వద్ద  ట్రేడవుతోంది. తొలుత రూ. 410 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 1,500 షేర్లు మాత్రమే కాగా.. మిడ్‌సెషన్‌కల్లా 7,000 షేర్లు చేతులు మారాయి.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ