amp pages | Sakshi

పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలు అప్‌..

Published on Fri, 06/02/2023 - 04:08

వ్యవసాయానికి డిమాండ్‌ పెరగడం, వేసవి ప్రారంభంతో వాహన ఎయిర్‌ కండిషనింగ్‌ అవసరం వంటి అంశాలతో భారత్‌లో మేనెల పెట్రోల్‌ డీజిల్‌ అమ్మకాలు పెరిగాయని  తాజా గణాంకాలు తెలిపాయి. ముఖ్యాంశాలు పరిశీలిస్తే..

న్యూఢిల్లీ: దేశంలో అత్యధికంగా వినియోగించే ఇంధనం– డీజిల్‌కు డిమాండ్‌ ( మొత్తం డిమాండ్‌లో ఐదింట రెండు వంతుల వాటా) గత ఏడాది మేతో పోలిస్తే మేలో 9.3 శాతం పెరిగి 7.46 మిలియన్‌ టన్నులకు చేరుకుంది. ఏప్రిల్‌లో డిమాండ్‌ పెరుగుదల 6.7 శాతం.  
► నెలవారీగా చూస్తే డీజిల్‌ డిమాండ్‌ ఏప్రిల్‌లో 7.16 మిలియన్‌ టన్నులుకాగా, మేలో 4.2 శాతం పెరుగుదలతో 7.46 మిలియన్‌ టన్నులకు చేరింది.  
► ఇక పెట్రోల్‌ అమ్మకాలు వార్షికంగా 10.4 శాతం పురోగతితో 3.08 మిలియన్‌ టన్నులకు చేరింది. నెలవారీగా చూస్తే డిమాండ్‌ 16.5 శాతం పెరిగింది.  
► పారిశ్రామిక, వ్యవసాయ కార్యకలాపాలు పుంజుకోవడంతో మార్చి ద్వితీయార్థం నుంచి పెట్రోలు, డీజిల్‌ విక్రయాలు పెరిగాయి. మార్చి ప్రథమార్థంలో వార్షిక ప్రాతిపదికన పెట్రోల్‌ విక్రయాలు 1.4 శాతం, డీజిల్‌ 10.2 శాతం తగ్గాయి.
► ఉష్ణోగ్రత పెరుగుదలతో ఎయిర్‌ కండిషనింగ్‌ అవసరాలు పెరగడమూ మేలో వినియోగం పెరగడానికి ఒక కారణం.  
► రబీ పంటలు– ఎక్కువగా గోధుమలు, బార్లీ, ఆవాలు, నువ్వులు, పెసల పంటకాలం  అక్టోబర్‌–డిసెంబర్‌ మధ్య ప్రారంభమవుతుంది. నూర్పిడికాలం ఏప్రిల్‌ నుండి జూన్‌ వరకు ఉంటుంది. హార్వెస్టింగ్, ట్రాక్టర్ల అవసరాలు డీజిల్‌ డిమాండ్‌ పెరుగుదలకు దారితీస్తుంది.
► కోవిడ్‌ సంక్షోభంలో ఉన్న 2021మే నెలతో పోల్చితే పెట్రోల్‌ వినియోగం తాజా సమీక్షా నెల్లో 72 శాతం పెరిగింది. మహమ్మారి ముందు 2019 మే నెలతో పోల్చితే 23.7 శాతం ఎగసింది.  
► మే 2021తో పోల్చితే డీజిల్‌ వినియోగం 52.5 శాతం, మే 2019తో పోల్చితే 6.8 శాతం ఎగశాయి.  


పరిశ్రమ మాట..
ప్రభుత్వ, ప్రైవేట్‌ మూలధన వ్యయం పెరగడంతో భారత ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుంది. సేవల రంగం పటిష్టంగా ఉండగా తయారీ రంగం కూడా పుంజుకుంది. దేశంలో చమురు డిమాండ్‌కు
బలమైన పారిశ్రామిక కార్యకలాపాలు మద్దతునిస్తున్నాయి.  వ్యవసాయ రంగంలో డిమాండ్‌  పుంజుకోవడం ఇంధన డిమాండ్‌కు మద్దతు నిస్తోంది. నీటిపారుదల విభాగంలో పైపుల వినియోగం
ఇంధన డిమాండ్‌కు కారణంగా ఉన్న మరో కీలక అంశం.   

జెట్‌ ఫ్యూయల్‌కు డిమాండ్‌
ఏవియేషన్‌ రంగం నిరంతర సేవల పునఃప్రారంభంతో విమానాశ్రయాలలో భారత్‌ మొత్తం ప్రయాణీకుల రద్దీ కోవిడ్‌ ముందస్తు స్థాయికి చేరువవుతోంది. ఈ నేపథ్యంలో జెట్‌ ఫ్యూయెల్‌ డిమాండ్‌ మే నెల్లో 2022 ఇదే నెల్లో పోల్చితే 8.7 శాతం పెరిగి 6,09,800 టన్నులకు ఎగసింది. 2021 మేతో పోల్చితే 137 శాతం పెరిగింది. అయితే కోవిడ్‌ ముందస్తు విషయానికి వస్తే, 2019 మేనెలతో పోల్చితే 5.3% తక్కువగానే నమోదయ్యింది. అలాగే ఏప్రిల్‌ 2023తో (6,13,900 టన్నులు) పోల్చినా డిమాండ్‌ 0.7% తక్కువగానే ఉంది.  

వంట గ్యాస్‌ అమ్మకాలూ అప్‌
మరోవైపు వంట గ్యాస్‌ ఎల్‌పీజీ అమ్మకాలు వార్షికంగా మేలో 10% పెరిగి 2.4 మిలియన్‌ టన్నులకు చేరింది. ఎల్‌పీజీ వినియోగం 2021 మేతో పోల్చితే 13%, కోవిడ్‌ ముందస్తు కాలం 2019 మేతో పోల్చితే 19.6 % ఎగసింది. నెలవారీ డిమాండ్‌ చూసి నా (2023 ఏప్రిల్‌) మేనెల్లో ఎల్‌పీజీ డిమాండ్‌ 11.3 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో డిమాండ్‌ 2.19  మిలియన్‌ టన్నులు.

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)