బుల్‌ రన్‌: పెట్టుబడిదారులకు లాభాల పంట

Published on Tue, 11/29/2022 - 15:49

సాక్షి,ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో  ముగిసాయి.  గత రెండు సెషన్‌లుగా  రికార్డుల మోత మోగిస్తున్న సూచీలు మంగళవారం కూడా అదే జోష్‌ను కంటిన్యూ చేశాయి.  అంతేకాదు వరుసగా ఆరో సెషన్‌లో లాభపడ్డాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ముఖ్యంగా ఎఫ్‌ఎంసిజి మెటల్ రంగ షేర్లు భారీ లాభాలనార్జించాయి.  చివరికి నిఫ్టీ 55 పాయింట్లు ఎగిసి 18618 వద్ద, సెన్సెక్స్‌  177 పాయింట్ల లాభంతో 62,681 వద్ద స్థిర పడ్డాయి.  ఇంట్రా డేలో సెన్సెక్స్‌ 62,887 పాయింట్ల వద్ద, నిఫ్టీ  18,678  వద్ద ఆల్‌ టైంని నమోదు చేశాయి.  

హోచ్‌యూఎల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హీరోమోటో,బ్రిటానియా, సిప్లా టాప్‌ విన్నర్స్‌గా నిలిచాయి. ఇండస్‌ఇండ్‌, సిప్లా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐషర్‌ మోటార్స్‌, పవర్‌గగ్రిడ్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో  రూపాయి 81.72 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది.  సోమవరం 81.67 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ