amp pages | Sakshi

ఓలా, టెస్లాకు పోటీగా సింపుల్ ఎనర్జీ సంచలన నిర్ణయం

Published on Mon, 08/30/2021 - 15:38

బెంగళూరుకు చెందిన ఈవీ మేకర్ సింపుల్ ఎనర్జీ మార్కెట్లో ఉన్న పోటీని ఎదుర్కోవడానికి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెలలో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక భవిష్యత్ ఉత్పత్తి శ్రేణిలో భాగంగా ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ తయారు చేయాలని భావిస్తున్నట్లు సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, సీఈఓ సుహాస్ రాజ్ కుమార్ తెలిపారు. తన స్వల్పకాలిక ప్రణాళికల్లో భాగంగా ఈ స్టార్టప్ ఈ సంవత్సరం చివరి నాటికి ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను త్వరగా మార్కెట్లోకి తీసుకొని రావడానికి వేగంగా ప్రణాళికలు చేస్తుంది అని అన్నారు.(చదవండి: కొత్త కారు కొనేవారికి మారుతి సుజుకి షాక్!)

దీనితో పాటు వచ్చే ఏడాది నాటికి ఒక ఈ-బైక్ తో పాటు రాబోయే ఒకటిన్నర సంవత్సరంలో కొత్త పవర్ ట్రైన్ తీసుకొనిరావలని యోచిస్తున్నట్లు అతను చెప్పాడు. "మేము బహుముఖ ఉత్పత్తి దిశగా వెళ్లాలని చూస్తున్నాము, మేము స్పష్టంగా నాలుగు చక్రాల వాహనాన్ని మా భవిష్యత్తు ప్రణాళికగా చూస్తున్నాము. మాకు ఒక విజన్ ఉంది. అందుకే ఆర్ & డీ(పరిశోధన & అభివృద్ధి) బృందాన్ని పెంచుతున్నాము" అని రాజ్ కుమార్ పీటీఐతో చెప్పారు. ఒక కంపెనీగా బహుళ ఉత్పత్తులతో రావాలని మేము చూస్తున్నాము అని నొక్కి చెప్పారు. రాబోయే మూడేళ్లలో మరో రెండు ఉత్పత్తులతో కంపెనీ వస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే, లాస్ట్ మైలు డెలివరీ, లాజిస్టిక్స్ పై ఎక్కువ దృష్టి సారించాము అని అన్నారు. ఈ సంవత్సరం చివరినాటికి ఫస్ట్ స్కూటర్ విడుదల చేస్తాము. ప్రస్తుతం ఇది టెస్టింగ్, హోమోలాజియేషన్ దశలో ఉంది అని అన్నారు.

ఈ సంస్థ హోసూర్(తమిళనాడు) వద్ద ఒక మిలియన్ సామర్థ్యంతో ఒక కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తోంది. "మేము తగినంత సామర్ధ్యం గల ఫ్యాక్టరీ కలిగి ఉన్నాము, తద్వారా డిమాండ్ పెరిగితే ఆ డిమాండ్ కి సరిపోతుంది. ఒక మిలియన్ సామర్థ్యాన్ని చేరుకోవడానికి కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది అని అనుకుంటున్నాము. కానీ, మార్కెట్ ఎలా స్పందిస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. మాకు మాత్రం ఫోర్ వీలర్ విషయంలో కచ్చితమైన ప్రణాళికలు ఉన్నాయి" అని ఆయన అన్నారు. దీర్ఘ కాలిక ప్ర‌ణాళిక ప్ర‌కారం వ‌చ్చే 18 నెల‌ల్లో దేశ‌వ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 1000 చార్జింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేయనున్న‌ది. ప్ర‌స్తుత ప్ర‌ణాళిక ప్ర‌కారం వ‌చ్చే 3-7 నెల‌ల్లో 300 పై చిలుకు చార్జింగ్ స్టేష‌న్లు ఏర్పాటు చేయాల‌ని సంక‌ల్పించింది. దేశీయ మార్కెట్‌తోపాటు విదేశాల‌కూ వాహ‌నాల‌ను ఎగుమ‌తి చేసేందుకు ప్ర‌ణాళిక‌లు ఉన్నాయ‌ని తెలిపింది.

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)