అమెరికాపై వడ్డీరేట్ల పెంపు ఎఫెక్ట్‌.. లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు!

Published on Fri, 07/15/2022 - 10:28

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్‌లపై పడింది. దీంతో శుక్రవారం దేశీయ స్టాక్‌ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. వడ్డీ రేట్ల పెంపుతో అమెరికా ఎకానమీపై ప్రభావం, బ్యాంకింగ్‌ దిగ్గజాలైన జేపీ మోర్గాన్‌, మోర్గాన్‌ స్టాన్లీ నిరుత్సాహ పరిచిన ఆర్ధిక ఫలితాలతో విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు.

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపారు. ఫలితంగా శుక్రవారం ఉదయం 10.20గంటలకు సెన్సెక్స్‌ 182 పాయింట్లు లాభంతో 53598 వద్ద నిఫ్టీ 59 పాయింట్ల స్వల్ప లాభంతో 15998 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. 

టాటా కాన్స్‌, భారతీ ఎయిర్‌ టెల్‌, బ్రిటానియా, ఎంఅండ్‌ ఎం, నెస్లే, టైటాన్‌ కంపెనీ, అదానీ పోర్ట్స్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటా మోటార్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. విప్రో,టాటా స్టీల్‌, కోల్‌ ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఓఎన్‌జీసీ, జేఎస్‌డ్ల్యూ స్టీల్‌ షేర్లు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.  

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ