Xiaomi: షావోమీ నుంచి ఎలక్ట్రిక్‌ వాహనాలు ..! ఎప్పుడు వస్తాయంటే..?

Published on Tue, 10/19/2021 - 17:40

స్మార్ట్‌ఫోన్‌ రంగంలో షావోమీ పెను సంచలనాన్నే సృష్టించింది. సూపర్‌ ఫీచర్స్‌తో అత్యంత చౌక స్మార్ట్‌ఫోన్లను షావోమీ ప్రపంచానికి పరిచయం చేసింది. కేవలం స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తులపైనే ఫోకస్‌ పెట్టకుండా ఇతర ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులపై కూడా షావోమీ దృష్టి సారించింది.ఇప్పటికే షావోమీ ల్యాప్‌ట్యాప్స్‌, గృహోపకరణ ఉత్పత్తులను కూడా లాంచ్‌ చేసింది. 
చదవండి: ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో సంచలనం..! ఇది వస్తే ఆ సమస్యకు చెక్‌..!

ఇప్పుడు వీటిపై దృష్టి...!
ప్రపంచవ్యాప్తంగా పలు ఆటోమొబైల్‌ కంపెనీలు సంప్రాదాయ శిలాజ ఇంధన వాహనాలకు స్వస్తి పలుకుతూ..ఎలక్ట్రిక్‌ వాహానాల తయారీపై దృష్టిసారించాయి. ఆటోమొబైల్‌ కంపెనీలకు పోటీగా  ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఆపిల్‌ కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కోసం ఇప్పటికే పావులు కదుపుతోంది. అతి త్వరలోనే ఆపిల్‌ తన ఎలక్ట్రిక్‌ వాహనాలను లాంచ్‌ చేసేందుకు ప్రయత్నాలను చేస్తోంది.

ఆపిల్‌ లాంటి దిగ్గజ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలే కాకుండా ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం  షావోమీ కూడా ఎలక్ట్రిక్‌ వాహానాల తయారీపై దృష్టిసారించింది.  ఎలక్ట్రిక్‌ కార్లను 2024 ప్రథమార్థంలో లాంచ్‌ చేయనున్నట్లు షావోమీ ఒక ప్రకటనలో పేర్కొంది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లీ జున్ మాట్లాడుతూ...2024లో భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్‌ కార్లను షావోమీ ఉత్పత్తి చేయనుందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో వచ్చే పదేళ్లలో సుమారు 10 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టనుందని తెలిపారు.

అత్యంత చౌక ధరలకే స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేసిన షావోమీ ఎలక్ట్రిక్‌ వాహనాల్లో భాగంగా మిగతా ఆటోమొబైల్‌ కంపెనీల ఈవీల కంటే తక్కువ ధరలకే షావోమీ అందించే అవకాశం లేకపోలేదని నిపుణుల భావిస్తున్నారు. 
చదవండి: ఆహా ఏమి అదృష్టం! ఏడాదిలో వారి దశ తిరిగింది

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ