బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. ఒకరు మృతి

Published on Wed, 02/24/2021 - 13:01

చంఢీగడ్‌: హరియాణలోని కర్నాల్‌ నగరంలో మంగళవారం రాత్రి ఓ బాణసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురి శరీరాలు కాలిపోయి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 9.30 గంటలకు ఘోగ్రిపూర్ రోడ్డు సమీపంలోని బాణసంచా తయారీ కర్మాగారంలో భారీ శబ్ధం, మంటలతో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఒక మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మరణించి వ్యక్తి మృత దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గాయపడిన ముగ్గురిని శివం కుమార్(28), విజయ్ పాల్(22), విజయ్ కుమార్(25)గా గుర్తించారు. వారంతా వలస కార్మికులని తెలిపారు. ఈ ప్రమాదంతో బాణసంచా కర్మాగారంలోని అధిక భాగం మంటల్లో కాలిపోయినట్లు తెలుస్తోంది. బాణసంచా కర్మాగారం యాజమాని రాకేష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. పేలుడు సంభవించిన సమయంలో మృతి చెందిన వ్యక్తితో పాటు మరో ముగ్గురు బాణసంచా తయారీ విభాగాన్ని శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియలేదన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

చదవండి:  కారు‌ టైరు పేలి.. ఏడుగురు అక్కడికక్కడే

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ