Hyderabad: నడిరోడ్డుపై సీఐ రాసలీలలు.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

Published on Fri, 11/04/2022 - 12:48

హస్తినాపురం(హైదరాబాద్‌): చట్టాన్ని పరిరక్షించాల్సిన రక్షకభటులే సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారు. నగరంలోని సౌత్‌జోన్‌లో కంట్రోల్‌ల్‌ రూంలో పనిచేస్తున్న ఓ సీఐ నడిరోడ్డుపై కారులో మహిళతో రాసలీలకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడటమేగాక డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్‌ కె.సత్యనారాయణ కథన ం మేరకు వివరాలిలా ఉన్నాయి.

రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం, బేగంపేట గ్రామానికి చెందిన రాజు వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హరిహరపురం కాలనీలో నివాసం ఉంటూ నగరంలోని సౌత్‌జోన్‌లో కంట్రోల్‌ రూమ్‌ సీఐగా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి అతను సాగర్‌ రహదారిపై పెట్రోల్‌బంక్‌ పక్కన కారులో పీకలదాకా  మద్యంతాగి మరో మహిళతో కారులో ఉండటంతో అతని భార్య, పిల్లలు అక్కడికి వెళ్లి అతడితో గొడవపడ్డారు.

దీనిని గుర్తించిన  పెట్రోలింగ్‌ కానిస్టేబుళ్లు నాగార్జున, నాయుడు అక్కడికి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా మద్యం మత్తులో ఉన్న సీఐ రాజు వారిపై దాడిచేసి గాయపరిచాడు. హెడ్‌ కానిస్టేబుల్‌ను వెంబడించి దాడికి ప్రయత్నించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. కానిస్టేబుళ్లపై దాడికి పాల్పడినందుకు కేసు నమోదు చేశామని, నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు.  
చదవండి: రెండు నెలల క్రితం లవ్‌ మ్యారేజ్‌.. అంతలోనే షాకింగ్‌ ఘటన.. అసలు ఏం జరిగింది?

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ