విషాదం: వంట చేస్తుండగా మంటలంటుకొని.. 

Published on Sat, 03/20/2021 - 08:41

సాక్షి, చిక్కడపల్లి: వంట చేస్తుండగా ప్రమాదవశాత్తూ మంటలంటుకొని చికిత్స పొందుతూ ఓ గృహిణి మృతి చెందిన ఘటన చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో జరిగింది. ఎస్‌ఐ కోటేశ్‌ వివరాల ప్రకారం.. బాగ్‌లింగంపల్లి పాలమూరుబస్తీలో నివాసముంటున్న బి.చిట్టి (24) గురువారం రాత్రి  గ్యాస్‌ పొయ్యి పని చేయకపోవడంతో నాలుగో అంతస్తులో ఉన్న టెర్రస్‌పైన కట్టెల పొయ్యిపై వంట చేయడానికి వెళ్లింది. కట్టెల పొయ్యిలో కిరోసిన్‌ పోసిన సమయంలో మంటలు ఎక్కువగా వచ్చి బట్టలకు అంటుకున్నాయి.  

కేకలు వేయడంతో అక్కడే ఉన్న గంగాధర్, సాయిలు ఆమె పై బ్లాంకెట్‌ కప్పి మంటలు ఆర్పేందుకు యత్నించారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ  మృతి చెందింది. కర్నాటక బళ్లారికి చెందిన చిట్టి సోదరుడు రామ్‌ అంజి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్‌ శివశంకర్‌రావు పర్యవేక్షణలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ