Health Tips: ఆపి ఉంచడం వలన మూత్రంలోని పదార్థాలు జిగటగా మారి.. ఆపై

Published on Sat, 02/05/2022 - 10:54

Do Not Hold Urine For Long Time: మూత్ర విసర్జన ఎప్పుడు చేస్తాం? మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే చేయలేం కదా? అది  ఎప్పుడు వస్తే అప్పుడే విసర్జన చేసేది కదా... దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా? అని చికాకు పడకండి. ఎందుకంటే స్కూలుకెళ్లే పిల్లలు మూత్రానికి వెళ్లవలసి వచ్చినా, టీచర్‌ని అడగడానికి సిగ్గుపడి అడగరు. ఒకోసారి అడిగినా, టీచర్లు పంపకపోవచ్చు వాళ్లు ఆ వంక పెట్టి బయటకు వెళ్లొస్తుంటారని!

దాంతో వాళ్లు ఆపుకోలేక చాలా ఇబ్బంది పడతారు. పెద్దవాళ్లు కూడా ఒకోసారి కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తుంటారు. అయితే అలా మూత్రం వచ్చిన వెంటనే ఆ పని కానివ్వకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు వైద్యులు. అవేమిటో చూద్దాం. ఒంట్లో ఉన్న మలినాల్ని కడిగి తనతోపాటు బయటకి తీసుకెళ్ళే ద్రవపదార్థమే మూత్రం. మరి ఆ మలినాలను ఎప్పటికప్పుడు బయటకి పంపాలి కాని ఆపితే ఎలా?  ఇది మంచి అలవాటు కాదు. దీనివలన ఎన్ని అనర్థాలు జరుగుతాయో తెలుసా? మీరే చూడండి.

సాధారణంగా మనుషుల బ్లాడర్‌ 400 మిల్లీలీటర్ల నుంచి 600 మిల్లీలీటర్ల దాకా మూత్రాన్ని ఉంచుకోగలదు. ఆ పరిమితి దాటిన క్షణం నుంచే బ్లాడర్‌ మీద ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అక్కడినుంచి ఎంతసేపు మూత్రాన్ని ఆపుకుంటే అంత ఒత్తిడి. బ్లాడర్‌ పరిమాణం ఇంకొద్దిగా పెరుగుతుంది. ఇలా పెరగడం మంచిదనుకుంటున్నారేమో...కానే కాదు. ఇలా సైజులో మార్పులు రావడం వలన మెదడుకి బ్లాడర్‌ నుంచి సంకేతాలు తక్కువగా అందుతాయి.

దాంతో మూత్ర విసర్జన జరగాల్సిన సమయంలో జరగకపోవచ్చు. ఇలా చేయడం వలన మలినాలు ఎక్కువసేపు అలానే ఉండిపోతాయి. మూత్రాన్ని అలా ఆపి ఉంచడం వలన మూత్రంలోని కొన్ని పదార్థాలు జిగటగా మారతాయి. ఇవే మెల్లిమెల్లిగా రాళ్ళుగా మారతాయి. ఇదే పద్ధతి కొనసాగిస్తూ ఉంటే, అవి ఇంకా బంకగా మారి, మరింత పెద్ద రాళ్లు వస్తాయి.

ఇలా క్రమంగా రాళ్ళు పెరిగిపోతూనే ఉంటాయి. మూత్రాన్ని ఆపుకోవడం వలన కిడ్నీల్లో స్టోన్స్, ఇన్ఫెక్షన్‌ వచ్చే ఛాన్స్‌ మహిళల్లోనే ఎక్కువ. ఎందుకంటే పురుషుల మాదిరి ఎక్కడపడితే అక్కడ మహిళలు మూత్రాన్ని విసర్జించలేరు కాబట్టి ఆపుకునే అలవాటు వారిలో ఎక్కువగా ఉండటం ఇలా జరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

ఈ అలవాటు వలన వచ్చే మరో సమస్య యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌. ఈ సమస్య పురుషులతో పోలిస్తే మహిళల్లో చాలా ఎక్కువ. ఈ రకమైన ఇన్ఫెక్షన్‌ వచ్చిందనుకోండి, మాటిమాటికి మూత్రం వస్తుంది, మూత్రంలో మంటగా ఉంటుంది, ఒక్కోసారి బ్లాడర్‌ ఖాళీగా ఉన్నా మూత్రం వచ్చినట్లుగా అనిపిస్తుంది.

అదే తీవ్రమైన సమస్య. ఒక్కోసారి మూత్రంలో రక్తం కూడా పడుతుంది. జ్వరం, వెన్నునొప్పి వంటి సమస్యలు ఎన్నో వస్తాయి. అందుకే ద్రవపదార్థాలను ప్లాన్డ్‌ గా తీసుకోవాలి. బస్సుల్లో దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు, ఆఫీసు మీటింగ్స్‌ ఉన్నప్పుడు కొద్దిగా తక్కువ తీసుకోవడం కొంత మెరుగు, ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే మాత్రం డ్రైవర్‌కి చెప్పి బస్‌ ఆపించడానికి మొహమాటపడద్దు. ఎందుకంటే ఒకోసారి అది ప్రాణాలకే ప్రమాదంగా పరిణమించవచ్చు.  

చదవండి: Jeedipappu Health Benefits: జీడిపప్పును పచ్చిగా తింటున్నారా..! సంతానలేమితో బాధపడే వారు పిస్తాతో పాటు వీటిని తింటే..

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)