మసాలా షికంజీ తయారు చేసే విధానం

Published on Tue, 04/26/2022 - 14:17

కావలసినవి: నిమ్మ కాయలు – మూడు, పంచదార – రెండున్నర టేబుల్‌ స్పూన్లు, అల్లం రసం – రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా, బ్లాక్‌ సాల్ట్‌ – అరటీస్పూను, ధనియాల పొడి – రెండు టీస్పూన్లు, మిరియాలపొడి – రెండు టీస్పూన్లు, వేయించిన జీలకర్ర పొడి – టీస్పూను, ఐస్‌ ముక్కలు –ఐదు, పుదీనా ఆకులు – గుప్పెడు, చల్లటి నీళ్లు, చల్లటి సోడా – జ్యూస్‌కు సరిపడా. 

తయారీ విధానం..
►మసాలా షికంజీ చేయడానికి సరిపోయే గిన్నెతీసుకుని నిమ్మరసం పిండాలి. దీనిలో పంచదార, రుచికి సరిపడా ఉప్పు, బ్లాక్‌సాల్ట్, ధనియాల పొడి, మిరియాలపొడి, జీలకర్ర పొడి, ఐస్‌ముక్కలు వేసి పంచదార కరిగేంత వరకు కలియతిప్పాలి. పంచదార కరిగాక, అల్లం రసం, పుదీనా ఆకులను మెత్తగా దంచుకుని వేయాలి. చివరిగా చల్లటి నీళ్లు, సోడా కలిపితే ఎంతో రుచికరమైన మసాలా షికంజీ రెడీ.
►నిమ్మరసంలో మసాలా పొడులు కలవడం వల్ల మరింత రుచిగా ఉండి, తాగిన వెంటనే దాహం తీరుతుంది.
►నిమ్మరసంలో ఉన్న పెక్టిన్‌ ఫైబర్, ఆస్కార్బిక్‌ ఆమ్లం, అల్లం రసం, జీలకర్ర, మిరియాల పొడులు పొట్టకు అనుకూలంగా పనిచేసి ఆహారం సవ్యంగా జీర్ణమయ్యేలా చేస్తాయి.
►మసాలా షికంజీ శరీరానికి పుష్కలంగా విటమిన్‌ సీ అందించడంతోపాటు, వేసవిలో వేడిచేయకుండా కాపాడుతుంది.  

#

Tags

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ