తప్పు పిల్లలదా? తల్లితండ్రులదా? టార్చర్ అంటూ..

Published on Fri, 03/10/2023 - 11:23

తప్పు పిల్లలదా? తల్లితండ్రులదా? ఈ మధ్యకాలంలో విద్యార్థుల ఆత్మహత్యల వార్తలు తరచూ వింటున్నాం. చదువుల వత్తిడి తట్టుకోలేకపోతున్నామని, గురువుల టార్చర్ భరించలేకపోతున్నామని ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ సమస్య వెనక బలహీనమైన పసి మనసు ఉందా? లేక అర్థం చేసుకోలేని తల్లితండ్రుల వైఖరి కారణమా?

ఒత్తిడిలో మునిగిపోతున్నారా?
కార్పొరేట్‌ కాలేజీల, పాఠశాలల విద్యార్థులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. తరుముకొస్తున్న పరీక్షలు, నానాటికీ పెరిగిపోతున్న ఎక్స్‌ పెక్టేషన్స్‌..ఒక పక్క తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలు. మరోపక్క తోటి విద్యార్థులు సాధిస్తున్న విజయాలు, మొత్తం మీద చూస్తే ఆడుతూ పాడుతూ సాగాల్సిన చదువులు... బంగారు భవిష్యత్తును చంపేసే చదువులుగా మారుతున్నాయి.

తీవ్రస్థాయి ఒత్తిడి తట్టుకోలేక చనిపోయే పిల్లలతోపాటు...భవిష్యత్తులో బతికే నైపుణ్యాలు లేక విలవిలలాడిపోతున్న విద్యార్థులు ఎందరో. తల్లితండ్రుల్లో తప్పేంటీ? పిల్లల ఆత్మహత్యల్లో విద్యావ్యస్థలో ఎన్ని లోపాలున్నాయో అన్నే లోపాలు తల్లిదండ్రుల్లో కూడా కనిపిస్తున్నాయి. ఇరుగు పొరుగువారిని చూసో, బంధువుల పిల్లల చదువుల్ని చూసో... అలాగే తమ పిల్లలకు కూడా ఎదగాలని.. వారికంటే ఒక మెట్టు ఎక్కువే వుండాలని తపన పడుతున్నారు.

తమ బిడ్డలపై లేనిపోని ఒత్తిడి పెంచుతున్నారు. ఇలాంటి ఆలోచనా విధానం మంచిది కాదు. పిల్లలకు ఏ చదువు నచ్చితే ఆ చదువులో ఎదిగేలా సహకారం అందించాలి. అప్పుడే వారు అన్ని విధాలా ఎదుగుతారు. ఆత్మహత్యల జోలికి పోరు.

ఫీజుల కోసం రాజీ పడ్డారా?
విద్యాసంవత్సరం ప్రారంభంలో వాతావరణం వేరు, ముగింపు సమయంలో వాతావరణం వేరు. ఎన్నెన్నో ఆశలు, ఆకాంక్షలతో విద్యాలయంలో చేరే పిల్లలు ... రానురాను పెరుగుతున్న వత్తిడి వాతావరణంలో ఇమడలేకపోతున్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించలేకపోతున్నారు.

పిల్లల సమస్యలు తెలిసినా సరే... అప్పటికే లక్షలాది రూపాయలు కట్టడంతో ఎలాగోలా అడ్జస్ట్ అయిపోవాలని చెబుతున్నారు. మరో పక్క పిల్లల మనోభావాల్సి ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదు. ఫీజులు తప్ప మరొకటి పట్టని మేనేజ్‌ మెంట్‌ తీవ్రస్థాయిలో నిర్లక్ష్యంగా వుంటోంది.

దాంతో విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. పిల్లలు ఆడుతూ పాడుతూ చదువుకుంటేనే వారిలో చైతన్యం వికసించి వారు రేపటి అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. అంతే తప్ప వారు బట్టీకొట్టి చదువుకునే రోబోలు కాకూడదు.
-యాజులు, సీనియర్‌ జర్నలిస్ట్‌, సాక్షి

చదవండి: H3N2 Virus: ఈ వైరస్‌ అంత డేంజరా? ఇలా చేశారంటే మాత్రం..

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)