ఇండో అమెరికన్‌ మహిళకు అరుదైన గౌరవం..!

Published on Thu, 04/01/2021 - 13:16

వాషింగ్టన్‌: టెక్సాస్ లోని ఓ స్కూలుకు భారత సంతతికి చెందిన మహిళ పేరును పెట్టనున్నారు. టెక్సాస్‌లో  ఏర్పాటు చేయనున్న ఎలిమేంట్రీ స్కూల్‌ 53 కు ఇండో అమెరికన్‌, సామాజిక కార్యకర్త అయిన సోనాల్ భూచర్ పేరు పెట్టాలని ''ద ఫోర్ట్ బెండ్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్'' ( ఎఫ్‌బీఐఎస్‌డీ) బోర్డ్ ఏక గ్రీవంగా తీర్మానం చేసింది. కాగా ఈ స్కూలును జనవరి 2023లో రివర్‌ స్టోన్‌ కమ్యూనిటీలో ఏర్పాటు చేయనున్నారు. 2019లో సోనాల్‌ భూచర్‌(58) కాన్సర్‌తో మరణించింది.

సోనాల్ భూచర్ ముంబై ప్రాంతానికి  చెందినవారు. బొంబాయి యూనివర్శిటీలో ఫిజియో థెరపీలో గ్రాడ్యుయేషన్‌ పట్టా పొందారు.  1984లో స్వస్థలం వదిలి , ఆమె తన భర్తతో కలిసి హ్యూస్టన్ లో స్దిరపడ్డారు. సామాజిక కార్యకర్తగా మంచి పేరును గడించారు. అంతేకాకుండా  విద్యార్ధుల కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు.సోనాల్ భూచర్ ఎఫ్‌బీఐఎస్‌డీ బోర్డులో కొద్ది కాలం పనిచేశారు. ఆ సమయంలో సోనాల్ స్టూడెంట్ లీడర్‌షిప్ ప్రోగ్రాం, లెజిస్లేటివ్ అడ్వకేసీ ప్రోగ్రామ్, ఫోర్ట్ బెండ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అన్యువల్‌ ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌, వాచ్ ఎ లైఫ్‌ స్టైల్‌ ప్రోగ్రాం, స్కాలర్‌షిప్ ప్రోగ్రాంతో సహా పలు కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. అమెరికాకు వలస వచ్చిన వారికి ఈ విధంగా గౌరవం తెలపడం ఎంతో విశేషమని సోనాల్‌ మిత్రురాలు ఉష గంజు తెలిపింది.

చదవండి: భారత సంతతి సాధికారతకు శుభరూపం

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ