త్వరపడండి

Published on Wed, 03/22/2023 - 01:12

ఐదో తరగతి, ఇంటర్‌కు వచ్చిన దరఖాస్తులు ఇలా..

ప్రాంతం 5వ ఇంటర్‌

తరగతి

తూర్పు గోదావరి జిల్లా

గోపాలపురం 138 140

రాజమహేంద్రవరం 172 153

కొవ్వూరు(బీసీఆర్‌ఎస్‌) 177 174

వీరలంకపల్లి 195 116

లక్ష్మీనరసాపురం 213 44

కొత్తూరు –– 245

కాకినాడ జిల్లా

ఎ.మల్లవరం 76 64

చొల్లంగిపేట 82 88

ఏలేశ్వరం 85 55

జగ్గంపేట 93 91

పిఠాపురం 116 126

తుని 131 32

పి.వెంకటాపురం 138 178

సాంబమూర్తినగర్‌ 167 200

తుని(న్యూ) 174 –––

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

రాజోలు (బీసీఆర్‌ఎస్‌) 30 54

ముమ్మిడివరం 49 82

పి.గన్నవరం 73 22

అల్లవరం 73 73

కొమరిగిరిపట్నం 84 101

ద్రాక్షారామ 103 161

రాయవరం: పేద, మధ్య తరగతి, అల్పాదాయ వర్గాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు త్వరపడాల్సిన సమయం ఆసన్నమైంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల్లో ఐదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో చేరేందుకు ఈ నెల 24వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఐదో తరగతికి 2,369, ఇంటర్మీడియెట్‌లో ప్రవేశానికి 2,199 మంది దరఖాస్తు చేసుకున్నారు. గడువు సమీపిస్తున్న వేళ దరఖాస్తుల నమోదుకు విద్యార్థులు త్వరపడాలని అధికారులు సూచిస్తున్నారు. ఐదో తరగతిలో ఒకసారి సీటు సాధిస్తే భోజన, వసతితో పాటు ఇంటర్మీడియెట్‌ వరకూ ఉచితంగా చదువుకునే అవకాశం కలుగుతుంది. ఆంగ్ల మాధ్యమంలో బోధనతో పాటు నీట్‌/ఐఐటీలో ఉచిత శిక్షణకు అవకాశమున్న గురుకులాలల్లో ప్రవేశం విద్యార్థుల భవిష్యత్‌కు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వచ్చే నెల 23వ తేదీన జరిగే కామన్‌ టాలెంట్‌ ఎంట్రన్స్‌ పరీక్షలో ప్రతిభ చూపి ప్రవేశాలు పొందవచ్చు.

ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇదీ..

తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో 21 గురుకులాలున్నాయి. అనపర్తి మండలంలోని కొత్తూరు జూనియర్‌ కళాశాల మినహా మిగిలిన 20 గురుకులాల్లో ఐదో తరగతికి 80 సీట్ల చొప్పున 1,600, తుని మండలం లోవ కొత్తూరులోని పాఠశాల మినహా మిగిలిన 20 జూనియర్‌ కళాశాలల్లో 1,600 సీట్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బాలికలకు 16, బాలురకు 5 గురుకుల పాఠశాలలున్నాయి. కాకినాడ జిల్లాలో తొమ్మిది, తూర్పు గోదావరిలో 6, కోనసీమ జిల్లాలో 6 చొప్పున గురుకుల పాఠశాలలున్నాయి. ఇదిలా ఉండగా ఐదో తరగతిలో ప్రవేశానికి తూర్పు గోదావరి జిల్లాలోని గురుకులాలకు 895 మంది, కాకినాడ జిల్లాలోని గురుకుల పాఠశాలలకు 1,062, కోనసీమ జిల్లాలో 412 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఇంటర్మీడియెట్‌లో ప్రవేశానికి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని గురుకుల పాఠశాలలకు 872, కాకినాడ జిల్లాలో 779, కోనసీమ జిల్లాలో 548 చొప్పున దరఖాస్తులు వచ్చాయి.

గురుకుల పాఠశాల

ఫ గురుకులాల్లో ప్రవేశాలకు

24తో ముగుస్తున్న గడువు

ఫ 5వ తరగతికి 2,369,

ఇంటర్‌కు 2,199 దరఖాస్తులు

ఫ వచ్చే నెల 23న ప్రవేశ పరీక్ష

త్వరపడాలి

గురుకులాల్లో ఐదో తరగతి, ఇంటర్‌ ఫస్టియర్‌లో ప్రవేశానికి అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు త్వరపడాలి. ఈ నెల 24తో దరఖాస్తు గడువు ముగియనుంది. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఇది చక్కని అవకాశంగా భావించాలి. దరఖాస్తుకు గడువు పెంపుదల ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. పేద, మధ్య తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– ఎ.మురళీకష్ణ, డిస్ట్రిక్ట్‌ కో ఆర్డినేటర్‌, ఏపీ సాంఘిక సంక్షేమ వసతి, విద్యాసంస్థలు

Videos

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

Photos

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)