సినిమాపై ఆయనకున్న ఇష్టం ఎందరికో స్ఫూర్తి: ఏఆర్‌ రెహమాన్‌

Published on Tue, 05/03/2022 - 09:22

తమిళ సినిమా: నటుడు, దర్శకుడు ఆర్‌. పార్తీపన్‌కు సినిమాపై ఉన్న అమితమైన ఇష్టం చాలా మందికి స్ఫూర్తి అని ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ అన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే నటుడు పార్తీపన్‌ అనడంలో అతిశయోక్తి ఉండదు. ఈయన ఇంతకుముందు ఒత్త సెరుప్పు సైజ్‌ 7 చిత్రాన్ని రూపొందించి ఆస్కార్‌ గడప వరకు వెళ్లి వచ్చారు. తాజాగా మరో అద్భుత ప్రయోగాన్ని చేశారు. సింగిల్‌ షాట్‌తో 96 నిమిషాల నిడివితో ఇరవిన్‌ నిళల్‌ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించి కథానాయకుడిగా నటించారు.

ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా,  ఈ చిత్ర సింగిల్‌ సాంగ్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం చెన్నైలో నిర్వహించారు. ఏఆర్‌ రెహమాన్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్న ఈ వేదికపై ఏషియన్‌ బుక్‌ రికార్డు, గిన్నీస్‌ బుక్‌ రికార్డు ప్రతినిధులు ఈ చిత్రానికి కర్త కర్మ క్రియ అయిన ఆర్‌.పార్తీపన్‌కు వాటికి సంబంధించిన ధ్రువపత్రాలను ప్రదానం చేశారు. అనంతరం పార్తీపన్‌ మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం ఏలేలో అనే చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ కలిసి పనిచేయాలని భావించారని, ఆ తర్వాత కూడా పలుమార్లు ప్రయత్నించినా అది జరగలేదని, ఈ చిత్రంతో సాధ్యమైందని తెలిపారు. పార్తీపన్‌కు సినిమాపై ఉన్న ప్యాషన్‌ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఏఆర్‌ రెహమాన్‌ పేర్కొన్నారు.

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)