బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌.. ఓటీటీలోకి అఖండ!

Published on Wed, 12/08/2021 - 15:16

Balakrishna Akhanda In Hotstar OTT Release Date: న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన హైట్రిక్‌ మూవీ `అఖండ`. భారీ అంచనాల మధ్య డిసెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రొటీన్‌ కథే అయినా.. బాలయ్యను సరికొత్త గెటప్‌లో కనిపించడం, పోరాట ఘట్టాలు, డైలాగ్స్‌ అదిరిపోవడంతో ‘అఖండ’బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తుంది.  తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డు ఓపెనింగ్స్‌ని రాబట్టింది. కేవలం వారం రోజుల్లోనే రూ.85 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్ల చేసినట్లు తెలుస్తోంది.

చాలా రోజుల తర్వాత బాలకృష్ణ ఖాతాలో మరో సూపర్‌ హిట్‌ పడడంతో నందమూరీ అభిమానుల ఆనందానికి హద్దులేకుండా పోతుంది.  ఈ నేపథ్యంలో తాజాగా ‘అఖండ’ మూవీ గురించిన మరో క్రేజీ అప్‌డేట్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రం ఓటీటీలో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. 2022 కొత్త సంవత్సరం కానుకగా ఈ సినిమా ఓటీటీలో ప్రసారం కానున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో అఖండ స్ట్రీమింగ్‌ కానుందట. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి  నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది.


Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ