amp pages | Sakshi

అందరి ఇంట్లో జరిగే కథే ఈ సినిమా: కిరణ్‌ అబ్బవరం

Published on Wed, 09/14/2022 - 21:12

రాజావారి రాణిగారు, ఎస్ ఆర్ క‌ళ్యాణ‌ మండ‌పం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించు కున్న హీరో కిరణ్ అబ్బ‌వ‌రం. ఆయన తాజాగా నటిస్తున్న ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యంగ్ సెన్సేషన్ హీరో కిరణ్ అబ్బవరం, సంజ‌న ఆనంద్‌, సిద్ధార్ద్ మీన‌న్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా బాస్క‌ర్‌, సోను ఠాగూర్, భరత్ రొంగలి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యస్.ఆర్ కల్యాణ మండపం దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు.

‘యస్‌.ఆర్‌ కళ్యాణ మండపం’ లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత.. అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌ను పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ విడుదల చేయడంతో సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఇందులో హీరోయిన్ తండ్రిగా దర్శక, నిర్మాత ఎస్. వి కృష్ణారెడ్డి నటించడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 16న దేశవ్యాప్తంగా దాదాపు 550 పైచిలుకు థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా మూవీ హీరో కిరణ్ అబ్బవరం బుధవారం మీడియాతో ముచ్చటించారు.

⇔ దర్శకుడు కోడి రామకృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూసి పెరిగాను .ఆయనతో పనిచేసే అవకాశం దొరకపోయినా తన కూతురు కోడి దివ్య దీప్తి గారితో పని చేయడం ఆనందంగా ఉంది.అలాగే నేను నటించిన ఈ సినిమా ట్రైలర్‌ ను పవన్ అన్న లాంచ్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్యూ పవన్‌ సార్‌

⇔ మన అందరి ఇంట్లో జరిగే కథలా ఈ సినిమా  ఉంటుంది. కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో అండర్‌ కరెంట్‌గా ఒక ఇంపార్టెంట్‌ పాయింట్‌ని డిస్కస్‌ చేశాం. ఎస్వీ కృష్ణారెడ్డి గారి పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది . ఇందులోని తండ్రి కూతుళ్లు ఎమోషన్స్‌కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. 

⇔ హీరోగా సెటిల్ అవుతున్న టైంలో ఇలాంటి కథ నా కెరియర్కు చాలా బూస్టప్ ఇస్తుంది. ఇందులో  రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాను. అయితే ఇప్పటి వరకు రెండు షేడ్స్ ఉన్న పాత్ర  చేయడం ఇదే అవుతుంది. ఈ సినిమా ద్వారా అందరికీ మరింత దగ్గరవుతాను అనుకుంటున్నాను. హీరోయిన్‌కి కూడా మంచి ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ దొరికింది..



⇔ దర్శకుడు  శ్రీధర్ నా కాంబినేషన్‌లో సినిమా చేయడానికి  కొంతమంది ప్రయత్నించినప్పటికీ కోడి దివ్య గారి బ్యానర్‌ ఫైనల్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సినిమా కథ డిమాండ్ మేరకు డైలాగ్ వెర్షన్ నేనే రాశాను. ఇందులో నాది బాబా భాస్కర్‌ల ట్రాక్ చాలా బాగుంటుంది.

⇔ నిర్మాత కోడి దివ్య దీప్తి సహకారం వల్లే  ఈ సినిమా అనుకున్న దాని కంటే బాగా వచ్చింది. మణిశర్మ గారితో కలిసి పని చేసే అవకాశం దొరికినందుకు ఆనందంగా ఉంది. అయన ఇచ్చిన పాటలు అద్భుతంగా వచ్చాయి. అలాగే ఫైట్స్, ఎమోషన్స్ ఇలా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి.

⇔ ఇక తన తదుపరి చిత్రాలతో గురించి ప్రస్తావిస్తూ.. గీతా ఆర్ట్స్‌ ‘వినరో విష్ణు భాగ్యం’, మైత్రి మూవీ మేకర్స్‌లో ‘మీటర్’ ఈ రెండు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. ఏ యం రత్నం బ్యానర్ లోని రూల్స్ రంజన్ సినిమా 40 శాతం షూటింగ్ అయ్యింది. ఇవి కాకుండా ఈ చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదెతో త్వరలో మరో చిత్రం చేసే అవకాశం ఉంది అని ముగించారు.

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)