ముఖ్యమంత్రిగా పని చేసి చివరి రోజుల్లో తినడానికి తిండి లేని స్థితిలో..

Published on Mon, 06/05/2023 - 20:57

స్వాతంత్య్రోద్యమ పోరాటంలో దమ్ముంటే కాల్చండి.. రండిరా అంటూ పోలీసులకే ఎదురెళ్లి చొక్కా విప్పి రొమ్ము చరిచి నిలబడ్డ ఘనుడు టంగుటూరి ప్రకాశం పంతులు. సంతంత్ర ఉద్యమ పోరాటంలో ప్రజల కోసం తన యావదాస్తిని ఖర్చు చేసిన మహాశిలి ఈ ఆంధ్రకేసరి. కటిక పేదరికంలో జీవితాన్ని మొదలుపెట్టిన ఆయన పట్టుదలతో బారిష్టర్‌ చదివి డబ్బు సంపాదించారు. ఆంధ్రరాష్ట తొలి ముఖ్యమంత్రిగా పని చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు తన చివరి రోజుల్లో తినడానికి తిండి లేక అల్లాడిపోయారు. కటిక పేదరికంలోనే కన్నుమూశారు.

నిరుపేదల లాయర్‌
టంగుటూరి ప్రకాశం చివరి రోజుల్లో ఎంత ఇబ్బందులపాలయ్యాడో వివరించాడు సినీ గేయరచయిత టంగుటూరి వెంకట రామదాస్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'టంగుటూరి ప్రకాశం గొప్ప లాయర్‌. ఆయన న్యాయవాదిగా పని చేసేటప్పుడు ధనవంతుల దగ్గర ఎంత డబ్బు తీసుకునేవారో లేనివాళ్ల దగ్గర ఒక్క పైసా కూడా తీసుకునేవారు కాదు. ఒకసారి ఆయన కోర్టులో వాదిస్తున్నప్పుడు తన ఇంట్లో ఎవరో చనిపోయిన వార్త అందింది.

పూలకు బదులు పండ్లు తేవచ్చుగా
అయినా సరే ఆయన వెళ్లకపోవడంతో జడ్జి ఇంకా ఇక్కడే ఎందుకున్నావని అడిగారు. దానికాయన.. చనిపోయినవాళ్లను ఎలాగో తిరిగి తీసుకురాలేను. ఈ కేసు ఓడిపోతే వీరి జీవితం అన్యాయం అయిపోతుందని బదులిచ్చారు. అలాంటి నిస్వార్థ వ్యక్తి చివరి రోజుల్లో తినడానికి తిండి లేని దయనీయస్థితిలో గడిపారు. కటిక దరిద్రంలో ప్రాణాలు విడిచారు. ఒకసారి ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి సన్మానం చేశారు. ఈ పూలకు బదులుగా అర డజను అరటిపండ్లు తెస్తే తినేవాడిని కదరా అన్నారు. ఆ మాటతో ఆయన వాస్తవ స్థితి అర్థమై అక్కడున్నవారంతా ఏడ్చేశారు.

అలా సంపాదించిందంతా పోయింది
ఈ పరిస్థితికి రావడానికి గల కారణం.. టంగుటూరి ప్రకాశంకు ఉన్న మితిమీరిన జాలి, దయాగుణం. ఎవరైనా సాయమడిగితే తన దగ్గర ఎంతుంటే అంత ఇచ్చేవారు. బీరువాలో ఎంతుంటే అది రెండు చేతులతో తీసిచ్చేవారు. తన కోసం, తన కుటుంబం కోసం ఏదీ దాచుకోలేదు. అలా సంపాదించిందంతా పోయింది' అని పేర్కొన్నారు. కాగా టంగుటూరి వెంకటరామదాస్‌.. కౌసల్య, గోదావరి, శివలింగాపురం, మహదేవపురం, ఆది నీవే అంతం నీవే, నీకు నేను నాకు నువ్వు వంటి పలు చిత్రాల్లో గేయ రచయితగా పని చేశారు.

చదవండి: ఆదిపురుష్‌ ప్రీరిలీజ్‌  ఈవెంట్‌.. ప్లానింగ్‌ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ