నా బర్త్‌డే రోజు ఆ పని చేయండి

Published on Fri, 08/06/2021 - 14:56

Mahesh Babu: హీరో బర్త్‌డే అంటే చాలు.. వారం రోజుల ముందు నుంచే హడావుడి చేస్తుంటారు అభిమానులు. కనీవినీ ఎరుగని రీతిలో సెలబ్రేట్‌ చేయాలని తెగ ఉవ్విళ్లూరుతుంటారు. భారీ కటౌట్‌లు ఏర్పాటు చేసి, వాటికి అభిషేకాలు చేస్తూ, కిలోల కొద్దీ కేక్స్‌ రెడీ చేయించి వాటిని కట్‌ చేస్తూ, స్వీట్లు పంచుతూ, డ్యాన్సులు చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇక సోషల్‌ మీడియాలో అయితే ఫ్యాన్స్‌ చేసే హంగామాతో హీరో పేరు మార్మోగిపోతుంటుంది. కాగా మరో మూడు రోజుల్లో అంటే ఆగస్టు 9న సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు బర్త్‌డే. అయితే ఈ సారి తనకో చిన్న పని చేసి పెట్టమని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాడీ హీరో. తన పుట్టిన రోజున ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని కోరుతున్నాడు.

"నాపై ప్రేమాభిమానాలతో మీరు చేసే పనులు నన్నెంతగానో ప్రేరేపిస్తున్నాయి. అయితే ఈసారి మీ అందరికీ నాదో ప్రత్యేక విన్నపం. నా బర్త్‌డే రోజు ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌కు మద్దతుగా నిలబడండి. మొక్కలు నాటుతూ దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి నన్ను ట్యాగ్‌ చేయండి. వాటిని నేను కూడా చూస్తాను" అని పేర్కొన్నాడు. మహేశ్‌ తీసుకున్న ఈ మంచి నిర్ణయానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఎంత గొప్ప మనసంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ