amp pages | Sakshi

ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను ఓటీటీలో చూడాలంటే డబ్బు చెల్లించాలా?

Published on Sat, 05/07/2022 - 17:00

Pay per View For RRR Movie OTT Streaming: జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఎస్‌ఎస్‌ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చరిత్రలోని ఇద్దరు సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే సరికొత్త థిమ్‌తో జక్కన ఈ సినిమాను రూపొందించాడు. జూనియర్‌ ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామారాజుగా కనిపించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వసూళ్లు చేసింది. మొత్తం ఈ సినిమా రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. 

చదవండి: ఆసక్తికర వీడియో షేర్‌ చేసిన కొత్త పెళ్లి కూతురు ఆలియా

ఇదిలా ఉంటే త్వరలోనే ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలో సందడి చేయబోతోంది. ఈ నేపథ్యంలో డిజిటల్‌ ప్రేక్షకులకు షాకిస్తూ ఓ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. పే ఫర్‌ వ్యూ పద్దతిలో ఆర్ఆర్‌ఆర్‌ను ఓటీటీలో రిలీజ్‌ చేయాలని సదరు ఓటీటీ సంస్థలు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. అంటే ఈ మూవీని ఓటీటీలో చూడాలంటే ఇక్కడ కూడా టికెట్‌ తీసుకోవాలట. అయితే లాక్‌డౌన్‌లో చిన్న నుంచి పెద్ద సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమాలు చూడాలంటే ప్రీమియర్‌ చెల్లించాల్సి వచ్చింది. అయితే అది డైరెక్ట్‌ ఓటీటీలో రిలీజైన సినిమాలకు మాత్రమే.

చదవండి:  క్రికెటర్‌ కెఎల్‌ రాహుల్‌తో పెళ్లిపై హీరోయిన్‌ క్లారిటీ

కానీ మొదటిసారి థియేటర్లలో విడుదలయిన తర్వాత కూడా ఓటీటీలో చూడాలంటే పే ఫర్ వ్యూ ఫార్మాట్‌ను ఫాలో అవ్వాలంటున్నాయట 'ఆర్ఆర్ఆర్' ఓటీటీ ప్రీమియర్‌ సంస్థలు.  కాగా ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌కు హక్కులు భారీ డీల్‌కు అమ్ముడైన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్‌ను జీ5 భారీ డీల్‌కు సొంతం చేసుకోగా హిందీ, విదేశీ భాషల వెర్షన్‌ను మాత్రం నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేసిందని సమాచారం. ఇక మే 20న ఆర్ఆర్ఆర్ జీ5లో విడుదల కానుందని టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా మే చివరి వరకు జీ5లో ఈ సినిమా చూడాలంటే డబ్బులు చెల్లించక తప్పదని కూడా సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం.

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)