amp pages | Sakshi

అలాంటి అసోసియేషన్‌లో సభ్యుడిగా కొనసాగలేను: ప్రకాశ్‌ రాజ్‌

Published on Mon, 10/11/2021 - 12:05

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు.. ప్రకాశ్‌ రాజ్‌పై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్‌ ఘన విజయం సాధించగా, ఇక ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి కొందరు గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తొలిసారిగా ప్రకాశ్‌ రాజ్‌ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

చదవండి: ‘మా’ సభ్యత్వానికి ప్రకాశ్‌ రాజ్‌ రాజీనామా

ఈ మేరకు ఆయన ‘గెలిచిన మంచు విష్ణు, అతడి ప్యానల్‌ సభ్యులకు శుభాకాంక్షలు. ఒక ప్రణాళిక ప్రకారం వచ్చారని వాటన్నింటిన నెరవేర్చండి. ఇక ఈ ఎన్నికల్లో ఎలా ఓడిపోయాం, గెలిచాం అన్నది ముఖ్యం కాదు. ‘మా’ ఎన్నికలు రాజకీయ వేదిక కాదు. ప్రాంతీయత ఆధారంగా ఎన్నికలు జరిగాయి. పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారు కానీ ఎవరెవరు నాకు ఓటు వేశారో తెలియదు. రాజకీయం, సినిమా రెండు వేరు అనుకుంటున్నా. నా తల్లిదండ్రులు తెలుగు వారు కాదు. అది నా తప్పా. నేను తెలుగు వాడిని కాకపోవడం నా దురదృష్టం. అందుకే ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. ఇది ఆకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. ఓటమిని జీర్ణించుకున్నాకే రాజీనామా చేస్తున్నా’ అని పేర్కొన్నారు. అనంతరం తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  

చదవండి: MAA Elections 2021: ఇక సెలవంటూ నాగబాబు సంచలన నిర్ణయం

‘అసోసియేషన్‌కు ఒక నాయకత్వం వహించిన మీకు, తెలుగువాడు మాత్రమే ఉండాలన్నారు. దాన్ని మెంబర్స్‌ ఆమోదించారు. తెలుగుబిడ్డ, మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు. దాన్ని నేను స్వాగతిస్తున్నా. అలాగే ఒక కళాకారుడిగా నాకంటూ ఆత్మగౌరవం ఉంటుంది. అందువల్ల ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నా. ఇది బాధతో తీసుకున్న నిర్ణయం కాదు. ప్రేక్షకులకు నాకూ ఉన్న బంధం సినిమాలతో కొనసాగుతుంది. వచ్చే రోజుల్లో నేను అతిథిగా ఉండాలంటే అసోసియేషన్‌ మెంబర్‌గా ఉండకూడదు. పెద్ద నటులు కోట శ్రీనివాస రావు, రవిబాబు వ్యాఖ్యలను గౌరవిస్తాను. వారి చెప్పినట్టుగానే అతిథిగా ఉంటా. మీరు అనుకున్నది జరిగింది. ‘మా’ ఎన్నికల్లో జాతీయవాదం గెలిచిందంటూ బీజేపీ నేత బండి సంజయ్‌ కూడా ట్వీట్‌ చేశారు’ అంటూ ప్రకాశ్‌ రాజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)