ప్రముఖ సింగర్‌ ఇంట తీవ్ర విషాదం.. ఆగిపోయిన కొడుకు పెళ్లి

Published on Thu, 11/17/2022 - 12:32

కుమారుడి పెళ్లికి రెండురోజుల ముందు తల్లి చనిపోవడంతో ప్రముఖ సింగర్‌ ఇంట విషాదచాయలు నెలకొన్నాయి. వివరాల ‍ప్రకారం.. ప్రముఖ పంజాబీ సింగర్‌ నచ్చతార్‌ గిల్‌ భార్య దల్విందర్‌ కౌర్‌(48)కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచింది. దీంతో నేడు(నవంబర్‌17)న జరగాల్సిన కొడుకు పెళ్లి ఆగిపోయింది. దల్విందర్‌ కౌర్‌ ఆరోగ్యం బాలేకపోవడంతో ఇటీవలె కొడుకు, కూతురికి వివాహం నిశ్చయించారు.

దల్విందర్‌ కౌర్‌ చనిపోవడానికి రెండు రోజుల ముందే కూతురి పెళ్లి వైభవంగా జరిగింది. మరోవైపు కుమారుడి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతుండగా ఒక్కసారిగా ఆమె ఆరోగ్యం విషమించింది. దీంతో కుమారుడి పెళ్లి చూడకుండానే ఆమె కన్నుమూయడంతో పెళ్లింట విషాదం నెలకొంది. కాగా 2006లో గల్‌ సున్‌ హోగయా చిత్రంతో ఇండస్ట్రీకి ఇంట్రీ ఇచ్చిన నచ్చతార్‌ 'దిల్‌ దిత్తా నహీ సీ' అనే ఆల్బమ్‌తో పాపులర్‌ అయ్యాడు. ఆయన చివరగా 'జుగాడీ డాట్‌ కామ్‌' అనే చిత్రంలో పాడాడు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ