amp pages | Sakshi

రజనీకాంత్‌ ఆస్తుల విలువెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Published on Sun, 12/12/2021 - 11:42

Rajinikanth Assets And Net Worth Value: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన మ్యానరిజం, స్టైల్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. కండ‌క్టర్ నుంచి సూపర్‌ స్టార్‌గా ఎదిగారు ఆయన. ఇప్పటికీ రజనీ సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయంటే థియేటర్లో ఫ్యాన్స్‌ క్యూ కట్టాల్సిందే. అంతగా అభిమానుల ఆదరణ దక్కించుకున్న ‘తలైవా’ బర్త్‌డే నేడు(డిసెంబర్‌ 12). ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. 70 ఏళ్ల వయసులో కూడా యువ హీరోలకు పోటీ ఇస్తున్నారు. అయితే రజనీకాంత్ సినిమాల ద్వారానే బాగానే సంపాదించారు.

చదవండి: అల్లు అర్జున్‌ ‘పుష్ప’ ప్రి-రిలీజ్‌ బిజినెస్‌ ఎన్ని కోట్లో తెలుసా?

అత్యధికంగా సంపాదిస్తున్న తారల జాబితాలో రజనీకాంత్‌ ముందంజలో ఉంటారు. తమిళ సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న అగ్ర హీరోలలో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న హీరో రజనీ. ఈ నేపథ్యంలో ఆయన నికర ఆస్తులకు సంబంధించిన వివరాలు హాట్‌టాపిక్‌ మారాయి. కక్నా లెడ్జ్‌ 2021 నివేదిక ప్రకారం.. రజనీ నికర ఆస్తుల విలువ 360 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఆయన సినిమాల ద్వారా సంపాదించారు. కాగా ఎలాంటి కమర్షియల్‌ యాడ్స్‌ చేయడనే విషయం తెలిసిందే. దీంతో కేవలం సినిమాల ద్వారానే ఆయన ఇంత డబ్బు సంపాదిస్తే ఇంకా యాడ్స్‌ ద్వారా ఎంత సంపాదించేవారో అంటున్నారు. సగటున రజినీ ఒక్కో సినిమా 60 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటాడని సమాచారం. ఈ నివేదిక ప్రకారం రజనీ 100-120 కోట్ల రూపాయల పెట్టుబడిని కలిగి ఉన్నారట.

చదవండి: ‘పెద్దన్న’ మూవీ డైరెక్టర్‌కు రజనీ సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్‌

1950 డిసెంబర్‌ 12న కర్ణాటక మరాఠి కుటుంబంలో పుట్టిన రజనీ ‘అపూర్వ రాగంగళ్‌’(1975) అనే తమిళ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత పలు తమిళ, తెలుగు, కన్నడ చిత్రాలకు పనిచేశారు. ఈ క్రమంలో 1982లో ‘అంధా కానూన్’ సినిమాతో రజనీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు హేమమాలిని, రీనారాయ్‌లు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాతో బాలీవుడ్‌లోనూ తన మ్యాజిక్‌ని చూపించారు ఆయన. ఆ తర్వాత సౌత్‌తో పాటు హిందీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. ఇక రజనీకాంత్ ఇటీవల నటించిన అన్నాత్తై సినిమా తమిళ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇదే సినిమాను తెలుగులో పెద్దన్నగా రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. 

Videos

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

దేవర కోసం దసరా రేస్ నుంచి వెనక్కి తగ్గిన సినిమాలు

మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్ సీపీ

బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా

ప్రచారంలో దూసుకుపోతున్న అరకు ఎంపీ అభ్యర్థి తనూజ రాణి

Photos

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)