కుమారుడిని చూసేందుకు తొలిసారి జైలుకు వచ్చిన షారుక్‌

Published on Thu, 10/21/2021 - 11:20

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ తన తనయుడు ఆర్యన్‌ను చూసేందుకు తొలిసారి జైలుకు వచ్చారు. ముంబై ఆర్థర్‌ రోడ్డు జైలుకు బుధవారం ఆయన తనయుడిని కలిసి కాపేపు ముచ్చటించి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పోలీసుల అదుపులో ఉన్న ఆర్యన్‌ను షారుక్‌ కలుసుకోవడం ఇదే మొదటిసారి. కాగా ఈ నెల అక్టోబర్‌ 2న రాత్రి ముంబై తీరంలో క్రూయిజ్‌ షిప్‌పై దాడి చేసిన పోలీసులు షారుక్‌ కుమారుడితో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

చదవండి: షారుక్‌కు షాక్‌, ఆర్యన్‌కు దొరకని బెయిల్‌

ఈ దాడిలో పోలీసులు నిషేధిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్‌ కేసులో అరెస్ట్‌ అయి జైలులో ఉన్న ఆర్యన్‌కు ముంబై కోర్టు చుక్కలు చూపిస్తోంది. అరెస్ట్‌ అయినప్పటి నుంచి ఆర్యన్‌ పలుమార్లు బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేయగా.. ఈ కేసు విచారిస్తోన్న ప్రత్యేక న్యాయస్థానం మాత్రం ఆర్యన్‌ అభ్యర్థనను తోసిపుచ్చుతూ వస్తోంది. ఈ క్రమంలో బుధవారం మరోసారి ఆర్యన్‌కు బెయిల్‌ నిరాకరిస్తూ తీర్పు నిచ్చిన సంగతి తెలిసిందే. ఆర్యన్‌కు మళ్లీ బెయిల్‌ రద్దవ్వడంతో తనయుడిని చూసేందుకు షారుక్‌ ఆర్థర్‌ రోడ్డు జైలుకు వచ్చినట్లు సమాచారం.

చదవండి: నా కొడుక్కి బెయిల్‌ వచ్చేవరకు స్వీట్లు వండొద్దు! : గౌరీ ఖాన్‌

కాగా గ‌తవారం షారుక్‌తోపాటు అత‌ని భార్య గౌరీ ఖాన్ జైలులో ఉన్న ఆర్య‌న్‌తో వీడియో కాల్‌ మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌ నేపథ్యంలో విధించిన నిబంధనలను సడలిచింది. దీంతో జైలులో ఉన్న వ్యక్తులు తమ కుటుంబ సభ్యులను కలుసుకునే వెసులుబాటును ఇచ్చారు. ఈ క్రమంలో షారుక్‌, ఆర్యన్‌ను కలుసుకునేందుకు వచ్చారు. ఈ కేసు కోర్టు విచార‌ణ‌లో ఆర్యన్‌కు షారుక్ మేనేజ‌ర్ పూజా ద‌ద్లానీ, ఆయన న్యాయవాదులు సాయం చేస్తున్నారు. ప్రత్యేక న్యాయస్థానం తన బెయిల్‌ను నిరాకరిస్తుండటంతో ఇక ఆర్యన్‌ ముంబై హైకోర్టును ఆశ్రయించనున్నాడని సమాచారం. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ