● మహాసరస్వతి అలంకారంలో కటాక్షించిన భ్రామరి ● సంప్రదాయబద్ధంగా వీరాచార విన్యాసాలు ● నేడు స్వామిఅమ్మవార్ల రథోత్సవం

Published on Wed, 03/22/2023 - 02:30

భక్తజన సందోహం నడుమ స్వామి,అమ్మవార్ల ప్రభోత్సవం

చదువుల తల్లీ నమోస్తుతే..

ఉగాది మహోత్సవాల్లో భాగంగా మూడవ రోజు భ్రమరాంబాదేవి మహాసరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చతుర్భుజాలు కలిగి ఉండి వీణ, అక్షరమాల పుస్తకాన్ని ధరించిన ఈ దేవిని దర్శించడం వలన విద్యాప్రాప్తితో పాటు అభీష్టాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. అలాగే నందివాహనాధీశులైన శ్రీస్వామి అమ్మవార్లను దర్శించడంతో చేపట్టే పనుల్లో విజయం లభిస్తుందని, భోగభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.

శ్రీశైలంటెంపుల్‌: ఇల కైలాసమైన శ్రీగిరి క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో పాల్గొనేందుకు కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకున్నారు. దీంతో శ్రీశైల క్షేత్రం కన్నడ భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉత్సవాల్లో మూడోరోజు మంగళవారం శ్రీ భ్రమరాంబాదేవి మహాసరస్వతి అలంకారంలో భక్తులకు కటాక్షించారు. శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి నందివాహనంపై అదిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు నిర్వహించిన ప్రభోత్సవం నేత్రానందభరితంగా సాగింది. ముందుగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీభ్రమరాంబాదేవిని మహాసరస్వతి అలంకారంలో ప్రత్యేకంగా అలంకరించి విశేష అలంకార పూజలు చేపట్టారు. ఆతర్వాత ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు నందివాహనసేవ పూజలు చేపట్టి ఆలయ ఉత్సవాన్ని నిర్వహించారు. క్షేత్ర ప్రధాన వీధుల్లో నిర్వహించిన గ్రామోత్సవం కనులపండువగా సాగింది. కర్ణాటక జాంజ్‌, వీరగాసీ, కన్నడ జానపదడోలు, కోలాటం, చెక్కభజన, పగటి వేషాల ప్రదర్శన, బుట్టబొమ్మలు, గొరవయ్యల నృత్యం, తప్పెట్లు, కొమ్మువాయిద్యాలు, నందికోలు నృత్యాలు గ్రామోత్సవానికి మరింత వన్నెను తీసుకువచ్చాయి. పూజా కార్యక్రమాల్లో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్‌.లవన్న దంపతులు, ఏఈవోలు హరిదాసు, అర్చకులు, వేదపండితులు, అధికారులు పాల్గొన్నారు.

నేత్రానందభరితంగా ప్రభోత్సవం..

ఉగాది మహోత్సవాల్లో భాగంగా మూడోరోజు స్వామిఅమ్మవార్లకు ప్రభోత్సవం నిర్వహించారు. గంగాధర మండపం వద్ద వివిధ పుష్పాలతో అలంకరించిన ప్రభపై ఉత్సవమూర్తులను చేర్చి ప్రభోత్సవం నిర్వహించారు. గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు వేలాది మంది కన్నడ భక్తుల నీరాజనాల నడుమ ప్రభోత్సవం కన్నుల పండువగా సాగింది.

నేడు పంచాంగ శ్రవణం..

వీరాచార విన్యాసాలు..

అమావాస్య ఘడియలను పురస్కరించుకుని కర్ణాటక వీర శైవ భక్తులు అగ్నిగుండప్రవేశం, వీరాచార విన్యాసాల కార్యక్రమాన్ని నిర్వహించారు. శివదీక్షా శిబిరాల వద్ద కార్యక్రమం కోసం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. వీరాచార సంప్రదాయాన్ని అనుసరించి జరిపే ఈ కార్యక్రమానికి ఎంతో విశిష్టత ఉంది. కర్ణాటకకు చెందిన వీరశైవ భక్తులు వీరభద్రవచనాలను పఠిస్తూ శూలాలు, తదితర అస్త్రాలను తమ చెంపల్లోకి, నాలుకలలోకి, పెదవుల్లోకి, కడుపులోకి, చేతులకు గుచ్చుకున్నారు. ప్రత్యేక వేషదారణలో వివిధ రకాల వాయిద్యాల నడుమ వారు చేసే ఈ విన్యాసాలతో భక్తులను గగురుపాటుకు గురయ్యారు.

ఉత్సవాల్లో భాగంగా నాల్గవరోజు బుధవారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 10.30 గంటలకు దేవస్థాన అస్థాన సిద్ధాంతి పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞచే పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అలాగే సాయంత్రం స్వామిఅమ్మవార్లకు రథాంగహోమం, రథాంగపూజ, రథాంగ బలిహరణలు చేపట్టిన అనంతరం రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)