తమిళనాడు వెళ్లాలంటే ‘ఈ–పాస్‌’ తప్పనిసరి

Published on Mon, 03/08/2021 - 04:26

సాక్షి, చెన్నై: తమిళనాడుకు వెళ్లాలంటే ఇక ఈ–పాస్‌ తప్పనిసరి అని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో మూడు రాష్ట్రాల వారికి మినహాయింపు కల్పించారు. దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడు లోనూ క్రమంగా కేసులు సంఖ్య పెరుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడుకు వెళుతున్న వారి రూపంలోనే కేసులు పెరుగుతున్నట్టు పరిశీలనలో తేలింది. దీంతో తమిళనాడులోకి వెళ్లాలంటే, ఈ–పాస్‌ పొందాల్సిందేనన్న ప్రకటనను ఆదివారం ఆరోగ్యశాఖ చేసింది.

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పుదుచ్చేరిల నుంచి వచ్చేవారికి మాత్రం ఈ–పాస్‌ నుంచి మినహాయింపు కల్పించింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి ఇక్కడకు నేరుగా వచ్చే వాళ్లు, ఇతర రాష్ట్రాల మీదుగా విదేశాల నుంచి తమిళనాడులోకి వెళ్లే వాళ్లు తప్పనిసరిగా ఈ–పాస్‌ పొందాల్సిందేనని స్పష్టం చేసింది. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ