కరోనా భారత్‌: ఆందోళనకరంగా పాజిటివిటీ రేటు!

Published on Sat, 07/02/2022 - 10:05

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. గత వారంగా క్రమం తప్పకుండా 15వేలకు పైనే కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. దీనికి తోడు డెయిలీ పాజిటివిటీ రేటు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. టెస్టుల సంఖ్య పెంచితే.. కేసులు ఇంకా ఎక్కువే బయటపడతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. అదే సమయంలో​ జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు.

తాజాగా.. దేశంలో ఒక్కరోజులో 17,092 కేసులు నమోదు అయ్యాయి. మరణాలు 29 నమోదుకాగా.. 14,684 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,09,568కి చేరుకోగా.. పాజిటివిటీ రేటు 4.14 శాతానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రేసింగ్‌పై దృష్టిసారించాలని కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు కేంద్రం సూచిస్తోంది. మరోవైపు కరోనా జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరుతోంది.

భారత్‌లో ఇప్పటిదాకా కరోనాతో 5,25,168 మంది మరణించారు. కరోనా రికవరీ రేటు 98.54 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 4,28,51,590 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.  ఇప్పటిదాకా 1,97,84,80, 015 డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తైంది. కొత్త వేరియెంట్ల ముప్పు పొంచి ఉందన్న డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలను ఇప్పటికే పలు దేశాలు పరిగణనలోకి తీసుకుని ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నాయి.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ