ఇండిగో విమానంలో ‘బాంబు’ కలకలం

Published on Fri, 07/22/2022 - 07:18

పాట్నా: ఓ ప్యాసింజర్‌ చేసిన పని.. ప్రయాణికులతో పాటు పోలీసులను, విమాన సిబ్బందిని హడలగొట్టింది. ఇండిగో విమానంలో బాంబు కలకలం చోటు చేసుకుంది. ఢిల్లీకి చెందిన ఇండిగో విమానం(6e 2126)లో ఓ ప్రయాణికుడు తన బ్యాగులో బాంబు ఉందని చెప్పాడు. దీంతో విమానాన్ని పాట్నా జయ్‌ ప్రకాశ్‌ నారాయణ్‌ ఎయిర్‌పోర్టులోనే అత్యవసరంగా తనిఖీలు చేశారు. 

బుధవారం రాత్రి పాట్నా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు తన బ్యాగులో బాంబు ఉందని చెప్పడంతో అంతా ఉలిక్కి పడ్డారు. ప్రయాణికులందరినీ విమానం నుంచి కిందకు దించారు విమాన సిబ్బంది. ఆపై పోలీసులు బాంబు-డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో అతని బ్యాగ్‌ను చెక్‌ చేశారు. అలాగే ప్రోటోకాల్‌ ప్రకారం విమానం మొత్తం తనిఖీలు చేపట్టి.. ఏం లేదని నిర్ధారించారు. 

బాంబు బెదిరింపునకు పాల్పడ్డ ప్రయాణికుడు తన కుటుంబంతో ప్రయాణిస్తున్నాడని, అతన్ని అదుపులోకి తీసుకున్నామని, అతని మానసిక స్థితిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పాట్నా కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సింగ్‌ వెల్లడించారు. తనిఖీల అనంతరం విమానాన్ని ప్రయాణానికి అనుమతించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ