అప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు చనిపోయినట్లు డ్రామా.. చివరికి

Published on Thu, 09/15/2022 - 18:14

సాక్షి, బెంగళూరు: అప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు ఒక వ్యక్తి తాను చనిపోయినట్లు డ్రామా ఆడి అడ్డంగా దొరికిపోయాడు. ఈఘటన మాండ్య శ్రీరంగపట్టణ తాలూకా బొట్టనహళ్లి గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. గ్రామానికి చెందిన మను అనే వ్యక్తి ఫైనాన్స్‌ కంపెనీ ఏర్పాటు చేశాడు. బయట వ్యక్తుల వద్ద అప్పులు చేశాడు. బాకీ తీర్చాలని ఆసాములు ఒత్తిడి చేయడంతో గత నెల 12 నుంచి  కనిపించకుండా పోయాడు. తాను ధరించిన విగ్‌కు కోడి రక్తం పూసి, చెప్పులను కాలువ వద్ద వదిలేసి గోవా వెళ్లాడు.

వాటిని గమనించిన తల్లిదండ్రులు మనుని ఎవరో హత్య చేశారని భావించారు. ఇదిలా ఉండగా సుప్రియ అనే యువతికి రూ. 8 లక్షలు ఇచ్చినట్లు, అందుకు సంబంధించిన డాక్యుమెంట్‌ ఇవ్వాలని, లేదంటే సినిమా తరహాలో చంపేస్తానని ఓ వ్యక్తి మనును బెదిరించినట్లు ఒక ఆడియో వైరల్‌ అయింది. దీంతో మను తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి మను బతికే ఉన్నట్లు గుర్తించి అరెస్ట్‌ చేశారు. అప్పుల బాధతోనే డ్రామా ఆడినట్లు అంగీకరించాడు. 
చదవండి: బెంగళూరులో ఘోరం.. తమ్ముని భార్య వేధిస్తోందని

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ