ఆ ఆనందం వెలకట్ట లేనిది!: హృదయాన్ని కదిలించే వైరల్‌ వీడియో!:

Published on Mon, 01/10/2022 - 14:16

ఇంతవరకు మనం ఎన్నో వైరల్‌ వీడియోలు చూశాం. చాలా వరకు మనస్సుకు హత్తుకునేవి, కదిలించేవి చూశాం. అచ్చం అలాంటి వైరల్‌ వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తుంది. పైగా తమిళ నటుడు మాధవన్‌ని సైతం ఆకట్టుకుంది.

(చదవండి: అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి ప్రపంచంలోనే అతిపెద్ద తాళం!)

అసలు విషయంలోకెళ్తే...ఆ వీడియోలో ఒక కొడుకు తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా బహుమతి తీసుకువచ్చి ఇస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ఆమె సందేహంగా ఆ కవర్‌ని తెరుస్తుంది. ఆ తర్వాత ఆమె అందులో ఉన్న రూ. 8 వేలు ఖరీదు చేసే ఫోన్‌ని చూసి ఒక్కసారిగా చాలా సంబరపడిపోతుంది. పైగా ఆ ఆనందం మాటల్లో చెప్పలేనది, వెలకట్టలేనిది.

ఈ మేరకు మనసును కదిలించే ఈ వీడియోకి "ఈ ఆనందాన్ని వెలకట్ట లేం" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ విఘ్నేష్ అనే యూజర్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అయితే ఈ వీడియో ఎంతో మంది నెటిజన్లను కదిలించింది. ఆఖరికి తమిళనటుడు మాధవన్‌ సైతం "తల్లి ముఖంలో తెచ్చిన ఆనందం వెలకట్ట లేనిది" అని తమిళంలో క్యాప్షన్‌ ఇచ్చి మరీ రీట్విట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్‌, లైక్‌లు వస్తున్నాయి మీరు కూడా ఓ లుక్కేయండి.

(చదవండి: 60 మిలియన్లకు కోవిడ్‌ కేసులు..మృతుల సంఖ్య 8 లక్షలకుపైనే!)

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ