న్యాయమూర్తిని బలితీసుకున్న కరోనా

Published on Fri, 08/07/2020 - 10:26

పాట్నా  : భార‌త్‌లో క‌రోనా కోర‌లు చాస్తుంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు, మ‌ర‌ణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీహార్ రాష్ర్టంలో కోవిడ్ కార‌ణంగా మొద‌టిసారిగా ఓ జ‌డ్జి క‌న్నుమూశారు. వివ‌రాల ప్ర‌కారం.. పట్నా కుటుంబ న్యాయస్థానం ప్రిన్సిపల్‌ జడ్జి హరిశ్చంద్ర శ్రీవాస్తవ (58) శ్వాస ‌సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బుధ‌వారం ఎయిమ్స్‌లో చేర‌గా క‌రోనా ప‌రీక్ష‌లో పాజిటివ్ అని తేలింది. అప్ప‌టికే ప‌రిస్థితి విష‌మించ‌డంతో చికిత్స పొందుతూ శుక్ర‌వారం తుదిశ్వాస విడిచారు.

శ్రీవాస్తవ మృతిప‌ట్ల బిహార్ జుడీషియల్ సర్వీసెస్ అసోసియేషన్ కార్యదర్శి అజిత్ కుమార్ సింగ్ సంతాపం వ్య‌క్తం చేశారు. శ్రీనివాస్త‌వ మ‌ర‌ణించ‌డం తీర‌ని లోట‌ని పేర్కొన్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బాలియా జిల్లా శ్రీనివాస్త‌వ స్వ‌స్థ‌లం. బిహార్ ప‌బ్లిక్ స‌ర్వీసెస్ క‌మిష‌న్ ద్వారా ఎంపికైన త‌ర్వాత 1995 డిసెంబ‌ర్ 16న న్యాయ‌వ్యాదిగా ప్ర‌స్థానం ప్రారంభించారు. అయితే 2022 జూలై 31న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయాల్సి ఉండ‌గా కోవిడ్-19 బారిన పడి అకాల‌మ‌ర‌ణం చెందారు. (బిహార్‌లో‌ వరద బీభత్సం: 21 మంది మృతి)


 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ