Breaking News

‘ఏం రాహుల్‌.. విషం నింపుతున్నావ్‌’

Published on Wed, 06/16/2021 - 08:19

లక్నో: ఘజియాబాద్‌లో ఓ వృద్ధుడిపై దాడికి పాల్పడిన ఘటన యూపీని కుదిపేసింది. ఇది మత కోణానికి సంబంధించిన క్రూర ఘటనగా పేర్కొన్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. మతానికి, మానవత్వానికి ఇది సిగ్గుచేటంటూ స్పందించారు. ఈ నేపథ్యంలో గంటల వ్యవధిలోనే ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ రాహుల్‌కి స్ట్రాంగ్‌ బదులిచ్చారు. 

‘‘రాముడు ఎప్పుడూ సత్యమే పలుకుతాడు. ఆ పాఠం నీకు తెలియదు. నువ్వు జీవితంలో ఎప్పుడూ నిజాలు మాట్లాడవ్‌. ఈ ఘటనలో పోలీసులు ఏం జరిగిందో చెప్పిన తర్వాత కూడా.. నువ్వు అబద్ధపు ప్రచారంతో సొసైటీలో విషం నింపాలని చూస్తున్నావ్‌‌. అధికార దాహంతో మానవత్వాన్ని అవహేళన చేస్తున్నావ్‌. ఉత్తర ప్రదేశ్‌ ప్రజల్ని అవమానించడం ఇకనైనా ఆపేయ్‌’’.. అంటూ ట్విట్టర్‌లో యోగి రాహుల్‌ ట్వీట్‌ ఫొటోకి ఘాటుగానే బదులిచ్చారు.

జూన్‌ 5న లోని ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ సమద్‌ అనే వ్యక్తిని ఓ గ్రూప్‌ ఎత్తుకెళ్లి.. కత్తులతో బెదిరించడం, పాకిస్తాన్‌ స్పై అంటూ తిట్టడం, గడ్డం తీసేసిన ఘటన వైరల్‌ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఇది మతకోణంలోని ఘటన కాదని స్పష్టం చేశారు. ఆ దాడిలో హిందు, ముస్లిం ఇరువర్గాల వాళ్లు ఉన్నారని, తాయెత్తులు అమ్మే సమద్‌ తీరు బెడిసి కొట్టడంతోనే వాళ్లు ఆ దాడికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.  
చదవండి: ఆమె ట్వీట్‌తో ఇరకాటంలో యోగి

Videos

పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి ట్రోల్స్ పై రోజా క్లారిటీ

పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో అరాచకం

సివిల్స్ ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ

ఏపీ పోలీసుల తీరుపై హైకోర్ట్ మరోసారి తీవ్ర ఆగ్రహం

విజన్ కాదు, విస్తరాకుల కట్ట.. బాబుపై నిప్పులు చెరిగిన రోజా

Ambati: మాకు బుక్ ఎందుకు బుర్ర ఉంది...

మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా: వైఎస్ జగన్

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో సీఆర్పీఎఫ్ భారీ ఆపరేషన్

తిరుమల అతిధి గృహంలో లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన భక్తులు

PAC సభ్యులతో వైయస్ జగన్ సమావేశం

Photos

+5

హీరోయిన్ ప్రణీత కొడుకు బారసాల వేడుక (ఫొటోలు)

+5

ఓ ఈవెంట్‌లో సందడి చేసిన బిగ్‌బాస్‌ బ్యూటీ ప్రియాంక జైన్‌ (ఫొటోలు)

+5

'మన్మథుడు' అన్షు ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

భర్త వెంకట దత్తసాయితో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న పీవీ సింధు (ఫోటోలు)

+5

బోనమెత్తిన కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి (ఫొటోలు)

+5

జూన్‌ 14న గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం (ఫొటోలు)

+5

'రచ్చ' మూవీలో నటించిన ఈ పాప ఇప్పుడెలా ఉందో చూశారా (ఫోటోలు)

+5

ఏపీలో ఎండలు, వేడిగాలులతో జనాలు ఉక్కిరిబిక్కిరి (ఫొటోలు)

+5

భారత పర్యటనలో ఆంధ్రా అల్లుడు జేడీ వాన్స్‌ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

ప్రకాశం జిల్లా : కన్నుల పండువగా లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం (ఫొటోలు)