నామినేషన్‌ను ఉపసంహరించుకుని బీజేపీలోకి.. 

Published on Tue, 03/23/2021 - 13:44

కాసరగోడ్‌: కేరళలోని కాసరగోడ్‌ జిల్లా మంజేశ్వరం నియోజకవర్గం నుంచి బీఎస్‌పీ తరఫున పోటీకి దిగిన కె. సుందర తన నామినేషన్‌ను ఉపసంహరించుకుని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ పోటీ చేస్తున్నారు. సోమవారం సుందర మీడియాతో మాట్లాడుతూ.. తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నాననీ, ఇకపై బీజేపీ అభ్యర్థి సురేంద్రన్‌ విజయం కోసం అలుపెరగకుండా పని చేస్తానని ప్రకటించారు.

అయితే, సుందరను బీజేపీ బెదిరించి నామినేషన్‌ ఉపసంహరించుకునేలా చేసిందంటూ ఊహానాలు వెలువడ్డాయి. కె.సుందర, కె. సురేంద్రన్‌ పేర్లు ఒకేలా ఉండటంతో 2016 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న సుందరకు 467 ఓట్లు పడ్డాయి. ఆ ఎన్నికల్లో ఐయూఎంఎల్‌ అభ్యర్థి అబ్దుల్‌ రజాక్‌ చేతిలో కె.సురేంద్రన్‌ కేవలం 89 ఓట్లతో ఓటమి చవిచూశారు. అబ్దుల్‌ రజాక్‌కు బోగస్‌ ఓట్లు పడ్డాయంటూ సురేంద్రన్‌ కోర్టుకు కూడా వెళ్లారు. అయితే, రజాక్‌ 2018లో చనిపోవడంతో ఆయన ఆ కేసును ఉపసంహరిం చుకున్నారు. 


బీజేపీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ