amp pages | Sakshi

Munugode Politics: కారు వైపే కామ్రేడ్లు!

Published on Sat, 08/20/2022 - 01:04

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్ని కల్లో టీఆర్‌ఎస్‌కే మద్దతివ్వాలని సీపీఐ, సీపీఎం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని భావిస్తున్నట్టు సమాచారం. రెండు పార్టీలకు కలిపి మునుగోడు నియోజకవర్గంలో 25 వేలకుపైగానే ఓటింగ్‌ ఉంటుందని, ఇది ఇతరపార్టీల విజయావకాశాలను ప్రభావితం చేస్తు ందని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో వామపక్షాలు చివరిగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్న దానిపై చర్చ జరుగుతోంది. 

కాంగ్రెస్‌కు దూరమే! 
మునుగోడులో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇవ్వకూడదన్న ఆలోచనలో ఉన్నట్టు సీపీఐ నేత ఒకరు పేర్కొ న్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరుతున్నందున.. కాంగ్రెస్‌ ఓట్లు రెండుగా చీలుతాయని, ఆ పార్టీకి వామపక్షాలు మద్దతిచ్చినా బీజేపీనే లాభపడుతుందని ఆయన విశ్లేషించారు. ఇక కొంతకాలం నుంచి బీజేపీ, ప్రధాని మోదీల తీరుపై సీఎం కేసీఆర్‌ విరుచుకుపడుతున్నారు.

బీజేపీని దీటుగా ఎదుర్కోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని వామపక్షాల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నట్టు సమాచారం. ఇప్పుడు మునుగోడులో టీఆర్‌ఎస్‌కు ఇచ్చే మద్దతుతో కుదిరే పొత్తు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగే అవకాశముంటుందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికల్లో కొత్తగూడెం, భద్రాచలం, మిర్యాలగూడ, ఖమ్మం లేదా పాలేరు నియోజకవర్గాలను తమకు కేటాయించాలని వామ పక్షాలు కోరే చాన్సుందని అంటున్నాయి. 

టీఆర్‌ఎస్‌ నేతలతో చర్చలు షురూ.. 
బీజేపీకి బ్రేక్‌ వేయడంపై అధికార టీఆర్‌ఎస్‌ గట్టిగా దృష్టి పెట్టినట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ విధానాలపై తీవ్ర వ్యతిరేకత ఉన్న సీపీఐ, సీపీఎంల మద్దతు తీసుకోవాలని నిర్ణయించినట్టు పేర్కొంటున్నాయి. తమ పార్టీ నేతలను చర్చలకు రావాలని సీఎం కేసీఆర్‌ ఆహ్వానించారని.. మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, రైతుబంధు సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తమ నేతలతో మాట్లాడారని సీపీఐ, సీపీఎం నేతలు వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్‌నేత మల్లు రవి కూడా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను కలిసి తమకు మద్దతివ్వాలని కోరినట్టు సమాచారం. బీజేపీని ఓడించగల పార్టీకే మద్దతు ఇస్తామని తమ్మినేని స్పష్టం చేసినట్టు తెలిసింది. 

రాష్ట్రస్థాయి సమావేశాల్లో చర్చలు 
మునుగోడు ఎన్నిక విషయంగా సీపీఐ, సీపీఎం రాష్ట్రస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నాయి. సీపీఎం రాష్ట్ర కమిటీ, రాష్ట్ర కార్యదర్శివర్గం భేటీలు శుక్రవారం జరుగగా.. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ విస్త్రృతస్థాయి సమావేశాలు శనివారం కూడా కొన సాగనున్నాయి. ఈ సమావేశాల్లో మునుగోడులో ఎలా వ్యవహరించాలన్న దానిపై నేతలు చర్చించారు. నిజానికి మునుగోడులో పలుసార్లు సీపీఐ అభ్య ర్థులు ఎమ్మెల్యేగా గెలిచారు.

ఆ పార్టీకి కేడర్, ఓటు బ్యాంకు ఉంది. సీపీఎంకు కూడా కొంత ఓటు బ్యాంకు ఉంది. ఈ నేపథ్యంలో కొందరు సీపీఐ నేతలు పార్టీ అభ్యర్థిని పోటీకి దించాలని, టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడం ఏమేరకు సమంజసమని పేర్కొన్నట్టు తెలిసింది. అయితే గతంలో గెలిచినప్పుడు పొత్తుల వల్లే సాధ్యమైందని, పైగా నియోజకవర్గ పునర్విభజన తర్వాత ఓటు బ్యాంకు తగ్గిందని మరికొందరు పేర్కొన్నట్టు సమాచారం.

అన్ని అంశాలను పరిశీలించి టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడమే సరైనదని ఆ పార్టీ పెద్దలు నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఇక సీపీఎం కూడా టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వడం ద్వారా బీజేపీకి చెక్‌ పెట్టవచ్చన్న అంచనాకు వచ్చినట్టు సమాచారం. తమ నిర్ణయాన్ని ఇప్పుడు ప్రకటించాలా, ఉప ఎన్నిక షెడ్యూల్‌ వచ్చాక చెప్పాలా అన్నదానిపై ఇంకా స్పష్టతకు రాలేదని తెలిసింది. ఇప్పటికిప్పుడు టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటిస్తే ఎన్నికల నాటికి సమీకరణాలు ఎలా మారుతాయోనన్న ఆలోచన ఉన్నట్టు సమాచారం. అందువల్ల రెండు పార్టీల సీనియర్లు సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది.  

Videos

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

దేవర కోసం దసరా రేస్ నుంచి వెనక్కి తగ్గిన సినిమాలు

మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్ సీపీ

బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా

ప్రచారంలో దూసుకుపోతున్న అరకు ఎంపీ అభ్యర్థి తనూజ రాణి

పెన్షన్ పంపిణీ కష్టాలపై వృద్ధుల రియాక్షన్..

ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు

ఇచ్చేవాడినే కానీ..లాక్కునేవాణ్ని కాదు..

పవన్ పై వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)